Skip to main content

ప్రైవేట్‌ స్కూళ్లపై మోజు వీడండి

కోలారు: విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రైవేట్‌ పాఠశాలలపై వ్యామోహం వీడి ప్రభుత్వ పాఠశాలలనే ఎంపిక చేసుకోవాలని స్యామ్‌సంగ్‌ ఇండియా కంపెనీ రిసోర్స్‌ విభాగం ప్రముఖుడు సంజీవ్‌ ప్రసాద్‌ పిలుపు నిచ్చారు.
Give up on private schools
ప్రైవేట్‌ స్కూళ్లపై మోజు వీడండి

శుక్రవారం హోళూరు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 15 పాఠశాలల విద్యార్థులకు కంపెనీ నుంచి రూ.70 లక్షల విలువ చేసే స్మార్ట్‌బోర్డులు, ల్యాప్‌టాప్‌లను అందించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సౌకర్యాల కల్పనకు కంపెనీ సిద్ధంగా ఉందన్నారు. ఉపాధ్యాయ బళగ అధ్యక్షుడు నారాయణస్వామి, క్షేత్ర సంయోజనాధికారి ప్రవీణ్‌, ఉపాధ్యక్షుడు వీరణ్ణగౌడ, చంద్రప్ప, సీఆర్పీ గోవిందు తదితరులు పాల్గొన్నారు.

స్నూకర్‌ చాంపియన్‌కు సన్మానం

కేజీఎఫ్‌: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరిగిన ప్రపంచ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో ట్రోఫీని కై వసం చేసుకుని పట్టణానికి తిరిగి వచ్చిన పాండియన్‌, జయలక్ష్మిల కుమార్తె కీర్తనను జైన్‌ కళాశాల యాజమాన్యం శుక్రవారం ఘనంగా సన్మానించింది. కళాశాల పాలకమండలి సభ్యురాలు మహేంద్ర మనోత్‌ మాట్లాడుతూ 21 ఏళ్ల కీర్తన పాండియన్‌ రియాద్‌లో జరిగిన ప్రపంచ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌ ట్రోఫీని గెలుచుకోవడం తమ కళాశాలకు, జిల్లాకు, దేశానికే గర్వకారణమన్నారు. తమ కళాశాల ఫైనలియర్‌ బీకాం విద్యార్థిని కీర్తన చేసిన సాధన అమోఘమన్నారు. కళాశాల నుంచి కీర్తనకు రూ.21 వేల నగదు బహుమతిని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ రేఖా సేథి, కీర్తన తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Published date : 05 Aug 2023 04:14PM

Photo Stories