Financial Literacy Week: పాఠశాల, ఇంటర్ విద్యార్థులకు అక్షరాస్యత వారోత్సవాలు..
బాపట్ల: విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. కలెక్టరేట్లోని స్పందన హాల్లో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లీడ్ బ్యాంకు మేనేజర్ కె.శివకృష్ణ మోహన్ మాట్లాడుతూ సోమవారం నుంచి మార్చి ఒకటో తేదీ వరకు జిల్లా స్థాయిలో వ్యాసరచన, నినాదం, పోస్టర్ విభాగాల్లో పోటీలు పాఠశాల, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
DSC Candidates: డీఎస్‌సీ అర్హులకు నియామక పత్రాలు..
వ్యాస రచన విభాగంలో ‘నేను రాత్రికి రాత్రే మిల్లియనియర్‌గా మారితే ఆ డబ్బును ఎలా ఉపయోగిస్తాను‘ అంశంపై 300 పదాలతో ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషల్లో రాయాలని తెలిపారు. నినాదం విభాగంలో ‘పొదుపు, చక్ర వడ్డీ యొక్క శక్తి‘ అనే అంశం, పోస్టర్ విభాగంలో ‘డిజిటల్, సైబర్ పరిశుభ్రత‘ అనే అంశంపై చేతితో గాని, డిజిటల్‌గా గాని వేయవచ్చన్నారు.