Skip to main content

Job Interviews: 28న మార్గాని ఎస్టేట్‌లో జాబ్‌ మేళా

రాజమహేంద్రవరంలోని మార్గాని ఎస్టేట్‌లో నిర్వహిస్తున్న జాబ్‌ మేళాలో ఈ జిల్లాకి చెందిన నిరుద్యోగులు పాల్గొనవచ్చని తెలిపారు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి. పూర్తి వివరాలను కూడా ఆయన వెల్లడించారు..
Complete details revealed by District Skill Development Officer for Job Mela at Margani Estate.  Job opportunity for unemployed youth at rajamahendravaram  District Skill Development Officer announcing Job Mela at Margani Estate, Rajamahendravaram.

ఏలూరు: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్‌, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 28న రీజనల్‌ జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గంటా సుధాకర్‌ ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరంలోని మార్గాని ఎస్టేట్‌లో జాబ్‌ మేళాలో ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన నిరుద్యోగులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.

Jobs: వైద్యారోగ్యశాఖలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

సుమారు 100కు పైగా కంపెనీల్లో దాదాపు 5 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారని తెలిపారు. టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌, పీజీ విద్యార్హతలు కలిగి 18 నుంచి 35 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు సెల్‌ 9666322032, 9652503799 లేదా టోల్‌ ఫ్రీ నంబర్‌ 9988853335లో సంప్రదించాలని కోరారు. అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత, ఇతర సర్టిఫికెట్లు ఒరిజినల్‌, జిరాక్స్‌ కాపీలతో హాజరుకావాలని సూచించారు.

Free Coaching: గ్రూప్స్‌, పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

Published date : 27 Feb 2024 01:36PM

Photo Stories