Skip to main content

Jobs: వైద్యారోగ్యశాఖలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌ నాగారం: ఆర్‌బీఎస్‌కే, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ పరిధిలో మెడికల్‌ ఆఫీసర్స్‌, డెంటల్‌ టెక్నిషియన్‌, సైకాలజిస్ట్‌ పోస్టులను కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి సుదర్శనం ఫిబ్ర‌వ‌రి 26న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Dental Technician Position Announcement   Psychologist Hiring for RBSK and NHM  nizamabad Nagaram Medical Officer Recruitment  Invitation of applications for filling up the vacancies in Medical Department

ఫిబ్ర‌వ‌రి 27 నుంచి మార్చి 2వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జిల్లా కలెక్టర్‌ వెబ్‌సైట్‌ nizamabad.telangana.gov.in ద్వారా నిర్ణీత తేదీల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేయాలని, అనంతరం దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసి వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. మెడికల్‌ ఆఫీసర్‌ (పురుష) 3, మెడికల్‌ ఆఫీసర్‌ (స్త్రీ) 8, సైకాలజిస్ట్‌ 1, డెంటల్‌ టెక్నిషియన్‌ 1 పో స్టును భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో వివరించారు.

చదవండి: Students Health Checkup: గురుకుల విద్యార్థుల ఆరోగ్య పరీక్ష..

ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు..

నేషనల్‌ హెల్త్‌ మిషనర్‌ ద్వారా ఖాళీగా ఉన్న మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టులను కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు వైద్యారోగ్యశాఖాధికారి సుదర్శనం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27 నుంచి మార్చి 2వ తేదీ వరకు nizamabad. telangana. gov. in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, అనంతరం దరఖాస్తులను డౌన్‌లోడ్‌చేసి వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

Published date : 27 Feb 2024 02:48PM

Photo Stories