Andhra Pradesh: విద్యాలయ దరిఖాస్తులకు మరొ కొద్ది రోజులు పోడుగింపు
Sakshi Education
అభ్యర్థులు పెరగడం, సర్వర్ సమస్యలు రావడంతో నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి గడువు ప్రకటించారు. వాటి స్పష్టత...
సాక్షి ఎడ్యుకేషన్: నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పొడిగించినట్టు పెదవేగి నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ తెలిపారు. సర్వర్‌లో సమస్యలు, తల్లిదండ్రుల అభ్యర్థనల మేరకు ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును ఈనెల 31 వరకు పొడిగించినట్టు చెప్పారు.
ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్షలో 87 శాతం మంది ఫెయిల్
తప్పులు ఉంటే సరిచేసుకోవడానికి గడువు తేదీ ముగిసిన తర్వాత మరో రెండురోజుల పాటు అవకాశం కల్పించారన్నారు. అలాగే లేటరల్ ఎంట్రీ సెలెక్షన్ పరీక్ష ద్వారా ఆరో తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించడానికి కూడా ఈనెల 31వ తేదీ వరకు గడువును పొడిగించారని తెలిపారు.
Published date : 27 Aug 2023 02:48PM