Skip to main content

Model Schools: టీచర్ల బదిలీలపై ఉత్కంఠ

కథలాపూర్‌(వేములవాడ): మోడల్‌ స్కూల్‌ టీచర్ల బదిలీల ప్రక్రియపై రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది.
Model Schools
టీచర్ల బదిలీలపై ఉత్కంఠ

 ఆదర్శ పాఠశాలలు ఏర్పాటయ్యాక తొలిసారి ఉపాధ్యాయుల/అధ్యాపకుల బదిలీలకు ప్రభుత్వం షెడ్యూల్‌ జారీచేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. ఆగ‌స్టు 10న వెలువడే కోర్టు తీర్పుతో బదిలీ ఉత్తర్వుల జారీ ముడిపడి ఉండటంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

మోడల్‌ స్కూళ్లలో పనిచేసే ప్రిన్సిపాళ్లు, పీజీటీ, టీజీటీలు అందరికీ బదిలీల ప్రక్రియలో అవకాశం కలుగనుంది. మరోవైపు బదిలీలపై బోధన సిబ్బంది దృష్టి సారించడంతో ఆశించిన స్థాయిలో విద్యాబోధన సాగడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.

చదవండి: Govt Schools: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

జిల్లాలో 13 స్కూళ్లు.. 171 మంది టీచర్లు..

  • జిల్లాలో 13 మోడల్‌ స్కూళ్లు ఉన్నాయి. ఇందులో ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఇంగ్లిష్‌ మీడియంలో బోధిస్తుండటంతో విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
  • జిల్లావ్యాప్తంగా ఆదర్శ పాఠశాలల్లో నలుగురు రెగ్యులర్‌ ప్రిన్సిపాళ్లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(పీజీటీ) 123 మంది, ట్రైన్డ్‌ గ్యాడ్యుయేట్‌ టీచర్స్‌(టీజీటీ) 44 మంది విధులు నిర్వర్తిస్తున్నారు.
  • మోడల్‌ స్కూళ్లు ఏర్పాటయ్యాక వాటిలో పనిచేసే బోధన సిబ్బంది నియామకమైనా.. ఇప్పటివరకు బదిలీలు జరగలేదు.
  • రాష్ట్రంలో కొత్త జిల్లాలు, జోన్‌లు ఆవిర్భావం తర్వాత బోధన సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
  • ఈ నేపథ్యంలో పాత జోన్‌ల ప్రకారమే బదిలీలకు ప్రభుత్వం ముందుకు వచ్చినా.. సీనియార్టీ, స్పౌజ్‌ కేటగిరీ విషయమై పలువురు టీచర్లు కోర్టును ఆశ్రయించారు.
  • దీంతో టీచర్ల బదిలీలకు సంబంధించి గతనెల 5 నుంచి 27వ తేదీ వరకు చేపట్టిన ప్రక్రియకు బ్రేక్‌ పడినట్లయ్యింది.
  • సీనియార్టీ జాబితా విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించి ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు.
  • చివరగా బదిలీ ఉత్తర్వులు జారీ కావడమేనని అనుకుంటున్న తరుణంలో కోర్టు తీర్పు కోసం మొత్తం ప్రక్రియ ఆగిపోయిది.
  • సుమారు నెలరోజులుగా బదిలీల గురించే బోధన సిబ్బంది చర్చించుకుంటున్నారు.
  • దీంతో విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడుతోందని తల్లిదండ్రులు అంటున్నారు.
  • ఎలాగైనా బదిలీపై వెళ్తున్నామనే భావనలో కొందరు విధులపై సరిగా దృష్టి సారించడంలేదనే విమర్శలు వస్తున్నాయి.
Published date : 10 Aug 2023 03:05PM

Photo Stories