RJD VAS Subbarao: విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి
సమగ్రశిక్ష అభియాన్ సమావేశ మందిరంలో మూడో విడత ప్రాంతీయ జిల్లాల సెకండరీ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ కార్యక్రమం బాపట్లలోని విస్తరణ శిక్షణ కేంద్రాన్ని ఆగష్టు 1న సందర్శించారు. ఆర్జేడీ సుబ్బారావు మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలన్నారు.
చదవండి: School Students: ఉపాధ్యాయుల కొరత తీర్చాలని ఆందోళన
అనంతరం డీఈఓ పీవీజే రామారావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గుణాత్మక విద్యను అందించాలన్నారు. రాష్ట్ర పరిశీలకురాలు కల్పన మాట్లాడుతూ బోధన పర్యవేక్షణ పద్ధతులు, పాఠ్యప్రణాళికలు ఐసీటీపై డీఆర్‌పీలు చక్కగా శిక్షణ పొందాలని సూచించారు. ప్రాంతీయ విద్యా సంచాలకులు వి.ఎస్.సుబ్బారావుతో పాటుగా సమగ్ర శిక్షా అకడమిక్ మానిటరింగ్ అధికారి మోజెస్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Navodaya Vidyalaya Samiti: ‘నవోదయ’ంలో ఉజ్వల భవిష్యత్.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే