Skip to main content

School Education: నాడు-నేడు అమెరికా విద్యారంగంలో మార్పులపై ఆగ్ర‌హం

విద్యారంగంలో మార్పుల కొల‌త‌ను నాడు నేడుగా చూడ‌వ‌చ్చు. పాఠ‌శాల నిర్వాహ‌ణ‌లో అప్పుడు అద్భుతంగా ఉండేవ‌ని తెలిపారు. పాఠ‌శాల‌లో ఇదివ‌ర‌కు ఉండే విధంగా నర్మాణం లేదని, సామాజికాభివృద్ధిలో వెనుకబ‌డ్డార‌ని, త‌ల్లిదండ్రులు, రాజ‌కీయులు త‌దిత‌రులు త‌మ ఆగ్రహాన్ని ఇలా వ్య‌క్తం చేశారు.
Parents and Teachers serious about American Education
Parents and Teachers serious about American Education

అమెరికా విద్యారంగంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, రాజకీయులు ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. కొన్నేళ్ళ క్రితం వరకు పాఠశాలల నిర్వహణ అద్భుతంగా ఉండేది. యువ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో చనువుగా ప్రవర్తించే వారు. పిల్లల విషయాలను చర్చించడానికి ఒక రోజయినా వారితో గడిపేవారు. నేటి విద్యార్థులు, యువత అతి తక్కువ సమయంలో ఊహించని, తీవ్రమయిన మార్పులకు గురవుతున్నారు. యుక్త వయసులోకి ప్రవేశిస్తున్న వీరు జ్ఞానాన్ని గ్రహించటానికి పెనుగు లాడుతున్నారు.

THE World University Rankings 2024: రికార్డు స్థాయిలో మ‌న‌ విశ్వవిద్యాలయాలు... భారత్ కు నాలుగవ స్థానం!!

పాఠశాలలకూ సమస్యలున్నాయి. విపరీతంగా సాగదీయ బడిన ప్రతిష్ఠాత్మక పునర్నిర్మాణ పథకం, ఆశించిన స్థాయిని అందుకోలేని దూరవిద్య, కరోన మహమ్మారి కాలపు అలవాట్ల నుండి బయటపడలేని దుఃస్థితి అందులో కొన్ని. విద్యాలయాల వద్ద మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల అమ్మకాలు మరో తీవ్ర సమస్య. బాంబుల, తుపాకుల ఉపయోగ సంస్కృతి సకారాత్మక నిర్ణయాలకు అడ్డుతగులుతున్నాయి. 

మహమ్మారి కాలంలో కోల్పోయిన పాఠ్యాంశాలను విద్యార్థులు ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నట్లు అనిపిస్తుంది. రెండేళ్లలో తప్పిన సాంఘికీకరణ, పరిపక్వతలను సంపాదిస్తున్నారు. సామాజిక అభివృద్ధిలో విద్యార్థులు రెండేళ్ళు వెనుకబడ్డారని మానసికశాస్త్ర ఉపాధ్యాయుల అభిప్రాయం. అందుకే బళ్ళలో అంతా బాగుందనే వాళ్ళ సంఖ్య తగ్గింది. విద్యారంగం పిచ్చివాళ్ళ, తీవ్రవాదుల హస్తాల్లో చిక్కుకుందని కొన్ని పత్రికలు ప్రచారం  కూడా చేస్తున్నాయి. అమెరికాలో విడాకులు పెరిగాయి. పిల్లలకు ఇద్దరు తల్లిదండ్రుల పెంపక అవకాశం లేదు. తల్లిదండ్రులు ఇద్దరిలో ఎవరో ఒకరే  పిల్లలను పెంచవలసి వస్తోంది.

AU Medical College: వైద్య రంగం కోర్సుల‌కు ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు

25 శాతం పిల్లలు ఇలాంటి వారే. ఏ దేశంలోనూ ఈ స్థితి ఈ స్థాయిలో లేదు. ఈ చేదునిజం అమెరికాలో సింగిల్‌ పేరెంట్‌ సంరక్షణ శిశువులను ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనితో సమాజం నష్టపోతోంది. ఈ పిల్లలు ప్రవర్తనా సమస్యలను ఎదుర్కొంటున్నారు. పాఠశాలల్లో వీరి సంఖ్య తక్కువ. వారిలో అవగాహన, బోధనాంశాలను అర్థం చేసుకోవడంలో తేడా ఉంటోంది. పిల్లల చదువు, భావిపౌరుల శ్రేయస్సుకు... అమెరికాలో పతనమయిన కుటుంబ, సామాజిక సంబంధాలను మెరుగుపర్చడమే మార్గం.

Teachers Eligibility Test: ఉపాధ్యాయుల‌కు ప‌దోన్న‌తల‌ను క‌ల్పించాలి.. ఉత్త‌ర్వుల‌పై పునఃస‌మీక్షణ జ‌ర‌గాలి

   – సంగిరెడ్డి హనుమంత రెడ్డి, వ్యాసకర్త ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం జాతీయ కార్యదర్శి

Published date : 29 Sep 2023 04:51PM

Photo Stories