Private Schools Admissions: నేడే ముగియనున్న ప్రవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు గడువు
రాయవరం: ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం సెక్షన్ 12(1)(సి) ప్రకారం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఇవ్వాల్సి ఉంది. గత ప్రభుత్వాల నుంచే చట్టం ఉన్నప్పటికీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తోంది. గత విద్యా సంవత్సరంలో కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ చట్టాన్ని అమలు చేసి 570 మంది విద్యార్థులకు ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పించారు.
Girls Sainik School: ఉత్తమ ఫలితాలతో విశ్వం విద్యార్థుల ప్రభంజనం
2024–25 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశానికి ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే నోటిఫికేషన్ విడుదల చేసి, మొదటి విడత జాబితాను కూడా విడుదల చేసింది. జిల్లాలో ఒకటో తరగతిలో ప్రవేశానికి 1203 మందికి అవకాశం కల్పించారు. వచ్చే విద్యా సంవత్సరానికి ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం పాఠకులకు విదితమే. ఈ గడువు ఆదివారం అర్థరాత్రితో ముగియనుంది.
Tenth Spot Valuation: ఈ కేంద్రంలో పరీక్షల మూల్యాంకనం.. 1200 మంది ఉపాధ్యాయుల నియామకం..!
జిల్లాలో పరిస్థితి ఇదీ..
విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు విధిగా కేటాయించాల్సి ఉంది. ఈ ప్రకారం జిల్లా పరిధిలో 347 ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలు ఇప్పటికే సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. పాఠశాల విద్యాశాఖ జిల్లాల వారీగా ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల జాబితాను ఆయా జిల్లాల విద్యా శాఖాధికారులకు గతంలోనే పంపించి, సీఎస్‌ఈ వెబ్‌పోర్టల్‌లో నమోదయ్యేలా చర్యలు చేపట్టింది. దీంతో ఐబీ/ఐసీఎస్‌ఈ/సీబీఎస్‌ఈ/స్టేట్ సిలబస్‌లు అమలవుతున్న ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
SSC Exam Evaluation:ఎస్‌ఎస్‌సీ పరీక్షలు పూర్తి.. స్పాట్ వ్యాల్యూవేషన్‌కి తేదీ..!
నేటితో ముగియనున్న గడువు
గత మార్చి నెలలో ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా పరిధిలో 3,076 మంది ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో 2,576 మంది చిన్నారుల తల్లిదండ్రులు వారు ఏ పాఠశాలలో సీటు కోరుకుంటున్నారో ఎంపిక చేసుకున్నారు. ఇంకా 500 మంది వారు కోరుకునే పాఠశాలలను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తు గడువు ముగిసిన అనంతరం దరఖాస్తుదారుల్లో అర్హులైన వారిని ఎంపిక చేసి, మొదటి విడత జాబితాను విడుదల చేయనున్నారు. మండలాల వారీగా ఎంపికైన చిన్నారుల జాబితాలో విద్యార్థి దరఖాస్తు ఐడీ, వారు ఏ సచివాలయం పరిధిలో ఉన్నారు.. వారిని ఏ ఏ పాఠశాలలకు కేటాయిస్తున్నారో తెలియజేయనున్నారు. ఆ ప్రకారం సంబంధిత విద్యార్థులు ఆయా పాఠశాలల్లో అడ్మిషన్ ఇచ్చే విధంగా జిల్లా విద్యాశాఖ పర్యవేక్షిస్తుంది.
AP Schemes: అమ్మ ఒడి వచ్చాకే పిల్లల చదువులు..
ఆదేశాలు కచ్చితంగా పాటించాలి
విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటవ తరగతిలో ప్రవేశానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. విద్యార్థుల తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– జి.నాగమణి, ఆర్‌జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ
Central Schools: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తులు
పాఠశాలలను ఎంపిక చేసుకోవాలి
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలను ఎంపిక చేసుకోవాలి. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– ఎం.కమలకుమారి, డీఈవో, అమలాపురం
Tenth Evaluation: పది పరీక్షల మూల్యాంకనం ప్రారంభం.. ఎప్పుడు..?
Tags
- free admissions
- private unaided schools
- students education
- District Education Officer
- Kamala Kumari
- online applications
- selections of schools
- Right to education
- first class admissions
- free education
- School Students
- Education News
- Sakshi Education News
- Poor Students
- notification for admissions
- Dr B R Ambedkar district news