Skip to main content

Holiday Cancelled Latest News: బ్రేకింగ్‌ న్యూస్‌ సెలవు రద్దు.. కీలక ప్రకటన

Holiday Cancelled News
Holiday Cancelled News

మహారాష్ట్ర ప్రభుత్వం ఈద్-ఈ-మిలాద్‌కు సంబంధించిన పబ్లిక్ హాలిడేను మార్చింది. ఈ మార్పును దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం బ్యాంక్ హాలిడేను సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 18కు మార్చినట్లు  వెల్లడించింది.

LIC లో ఇంటర్ అర్హతతో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు: Click Here

సెప్టెంబర్ 18న సెలవు కాబట్టి ఆ రోజు గవర్నమెంట్ సెక్యూరిటీలు, ఫారెన్ ఎక్స్చేంజ్, మనీ మార్కెట్‌, రూపీ ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్‌లలో  ఎలాంటి లావాదేవీలు, సెటిల్మెంట్లు ఉండవని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ లావాదేవాలన్నీ కూడా సెప్టెంబర్ 19న యధావిధిగా జరుగుతాయని సమాచారం.

ముహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు ఈద్-ఇ-మిలాద్ ఒక ముఖ్యమైన వేడుక. దీనిని ముహమ్మద్ పుట్టినరోజు, నబీ దినోత్సవం లేదా మౌలిద్ అని కూడా అంటారు. భారతదేశంలో ఇది ప్రభుత్వ సెలవుదినంగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ సందర్భాన్ని ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.

హాలిడే ఒక్క మహారాష్ట్రలో మాత్రమే కాకుండా గుజరాత్, మిజోరం, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, జమ్మూ, కేరళ, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లకు వర్తిస్తాయి. అంటే ఆ రాష్ట్రాల్లో కూడా బ్యాంకులు ఆ రోజు పనిచేయవు (మహారాష్ట్రలో 18న సెలవుదినం, ఇతర రాష్ట్రాల్లో 16 సెలవుదినం అని తెలుస్తోంది). కాబట్టి బ్యాంకుకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే ముందుగానే సెలవు గురించి తెలుసుకుని పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్‌లైన్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి.

Published date : 18 Sep 2024 08:16AM

Photo Stories