Skip to main content

Educational Notifications: బ‌యోమెట్రిక్ అథెంటికేష‌న్ త‌ప్ప‌నిస‌రి

ఇప్ప‌టి వ‌ర‌కు నిర్వ‌హించ‌ని బ‌యోమెట్రిక్ ను ప్ర‌భుత్వం ఇప్పుడు త‌ప్ప‌నిసరి అని తెలిపింది. జిల్లాలోని పాఠ‌శాల‌లో, క‌ళాశాల‌లో అధికారులకు స్కాలర్‌షిప్ వాళ్ళ‌కు బ‌యోమెట్రిక్ త‌ప్ప‌నిస‌రి అని స్ప‌ష్టం చేసారు.
biometric for scholarship for authentication
biometric for scholarship for authentication

సాక్షి ఎడ్యుకేష‌న్: ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి 2022–23 కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనాల మంజూరు కోసం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పాఠశాల/కళాశాలల అధికారులు, హెడ్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్‌, ఇనిస్టిట్యూట్‌ నోడల్‌ ఆఫీసర్‌ నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్లో బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ తప్పనిసరిగా చేయాలని జిల్లా మైనార్టీస్‌ సంక్షేమం సహాయ సంచాలకులు ఎన్‌ఎస్‌ కృపావరం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల/కళాశాల అధికారులు వారి బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ కోసం ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటలకు వారి ఆధార్‌ కార్డ్‌, ఆధార్‌ లింక్డ్‌ సెల్‌ నంబర్‌, ఎన్‌ఎస్‌పీ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తీసుకుని రావాల్సిందిగా కోరారు.

Jobs: గురుకులాల్లో Part time lecturer పోస్టుల భర్తీ

గత ఏడాది దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ కోసం విద్యార్థి ఆధార్‌ కార్డు, ఆధార్‌ లింక్డ్‌ సెల్‌ నంబర్‌, సదరు విద్యార్థిని తీసుకుని రావాలని సూచించారు. బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ పూర్తి అయిన పాఠశాల/కళాశాల అధికారులు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌ మంజూరు చేయుటకు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌ వెబ్‌సైట్‌లో ఇనిస్టిట్యూట్‌ లాగిన్‌లో వారి వారి విద్యార్థుల దరఖాస్తులను జిల్లా మైనార్టీస్‌ సంక్షేమ కార్యాలయానికి ఆన్‌లైన్‌ ద్వారా పరిశీలన చేసి పంపాలని ఏడీ కృపావరం కోరారు.

Published date : 06 Sep 2023 05:18PM

Photo Stories