APOSS: ఓపెన్ స్కూల్ ప్రవేశాలు.. చివరి తేదీ ఇదే!!
రాయవరం: ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవేశానికి నవంబర్ 26వ తేదీ వరకూ గడువు ఉందని ఏపీ సార్వత్రిక విద్యాపీఠం జిల్లా కో ఆర్డినేటర్ పి. సాయి వెంకట రమణ శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. నవంబర్ 27 నుంచి 30వ తేదీ వరకూ అపరాధ రుసుంతో అడ్మిషన్ పొందవచ్చన్నారు. అడ్మిషన్, రిజిస్ట్రేషన్ ఫీజు పదో తరగతి ఓసీ పురుషులకు రూ. 1,550, అన్ని వర్గాల మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ పురుషులకు రూ.1,150 చెల్లించాలన్నారు. ఇంటర్మీడియెట్‌లో అడ్మిషన్‌కు రిజిస్ట్రేషన్, అడ్మిషన్ ఫీజుగా ఓసీ పురుషులు రూ.1,800, అన్ని వర్గాల మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ పురుషులు రూ.1,500 చెల్లించాలన్నారు. విద్యా ర్థులు ప్రాస్పెక్టస్ కమ్ అప్లికేషన్ ఫాంలను స్టడీ సెంటర్ నుంచి ఉచితంగా పొందవచ్చని తెలిపారు. దర ఖాస్తు పూరించి, ఏపీ ఆన్‌లైన్ కేంద్రం ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఆన్‌లైన్ అప్లికేషన్ జిరా క్స్ కాపీ, ఫీజు రశీదును సంబంధిత అక్రిడిటేటెడ్ ఇన్ స్టిట్యూట్స్(ఏఐ)లో ఇవ్వాలని తెలిపారు. అడ్మిషన్ పొందిన వారు 30 రోజుల పాటు విధిగా తరగతులకు హాజరవాలన్నారు. స్టడీ సెంటర్‌లో ఎటువంటి ఫీజు లూ చెల్లించనవసరం లేదని, దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు సమీప అక్రిడిటేటెడ్ ఇనిస్టిట్యూట్లలో లేదా 89776 45704 నంబరును సంప్రదించాలని తెలిపారు.
చదవండి: Postal Jobs: 1,899 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, ఎంపిక విధానం విధానం ఇదే