Annual Examinations 2024: రేపటి నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం.. షెడ్యూల్ ఇలా..
నంద్యాల: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈనెల 6 నుంచి వార్షిక పరీక్షలు (5ఏ2/సీబీఏ3) ప్రారంభం కానున్నాయి. అందుకు విద్యా శాఖ ఏర్పాట్లను సిద్ధం చేసింది. ప్రశ్నాప్రత్రాలు కూడా ఎమ్మార్సీలకు చేరాయి. సిలబస్ పూర్తి కావడంతో ఉపాధ్యాయులు విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు 16వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు 19వ తేదీ పరీక్షలు జరుగుతాయి.
Summer Coaching Camps: సమ్మర్ కోచింగ్ క్యాంపుల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం
వీరిలో 6, 7, 8 తరగతుల విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ పరీక్షలు రాస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 3 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సీబీఏ విధానంలో, 9వ తరగతికి సీబీఎస్‌ఈ విధానంలో పరీక్షలు జరుగుతాయి. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు మాత్రం పాత విధానంలోనే నిర్వహిస్తారు. జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పరిధిలో 2,68,592 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
Govt Medical College: ప్రభుత్వ వైద్య కళాశాల స్థానచలనం.. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా..!
Tags
- Annual Exams
- first to ninth class students
- Schools
- exam centers
- arrangements at schools
- annual examinations 2024
- Teachers
- students education
- exam schedule
- district education officers
- exam papers
- Education News
- Sakshi Education News
- nandyala news
- Education Department
- Annual Examinations
- arrangements
- Explanation
- preparation
- Release
- SakshiEducationUpdates