Skip to main content

Summer Coaching Camps: సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపుల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

కాశిబుగ్గ : జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపుల నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి (డీవైఎస్‌ఓ) సత్యవాణి ఏప్రిల్‌ 4న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Invitation of applications for conducting Summer Coaching Camps

జిల్లా వ్యాప్తంగా 10 గ్రామీణ ప్రాంతాల్లో వివిధ క్రీడాంశాల్లో మే 1 నుంచి 31 వరకు వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

చదవండి: Mayank Yadav: ఐపీఎల్‌ హిస్టరీలో తొలి ఫాస్ట్‌ బౌలర్ ఇత‌నే..!

ఆసక్తి గల పీఈటీలు, పీడీలు, జాతీయ క్రీడాకారులు తమ పూర్తి వివరాలతో ఏప్రిల్‌ 10వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఓసిటీ స్టేడియంలోని జిల్లా యువజన క్రీడల కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. జీఓ 74లో ఉన్న క్రీడాంశాలకు ప్రాధాన్యం ఇస్తామని, గౌరవం వేతనం రూ.4వేలు చెల్లించనున్నట్లు తెలిపారు. వివరాలకు 7702155096, 9948185608 నంబర్లలో సంప్రదించాలని ఆమె సూచించారు.

Published date : 05 Apr 2024 03:37PM

Photo Stories