చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
Sakshi Education
ఆర్మూర్‌టౌన్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగమోహన్ అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని గురుకుల డిగ్రీ కళాశాలకు చెందిన సుద్దపల్లి క్రీడాకారిణి అజ్మీర ఇందు జూనియర్ ఆసియా సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపిక కావడంతో ఆదివారం ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమకు నచ్చిన క్రీడలో పాల్గొంటే శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందుతారన్నారు. అజ్మీర ఇందు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆసియా క్రీడలు చైనాలోని పింగ్‌టాన్ జరుగుతాయన్నారు. పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ స్వప్న, సాంఘిక సంక్షేమ విద్యాసంస్థల రాష్ట్ర సాఫ్ట్ బాల్ అకాడమీ కోచ్ వేముల మౌనికను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ధణవేణి, వైస్ ప్రిన్సిపాల్ శరణ్య, అధ్యాపకులు, సాఫ్ట్‌బాల్ బాలుర అకాడమీ కోచ్ నరేష్ పాల్గొన్నారు.
Published date : 07 Aug 2023 03:43PM