Skip to main content

RRB 9000 Jobs Notification 2024 Released : గుడ్‌న్యూస్‌.. టెన్త్‌, ఐటీఐ, డిప్లొమా/డిగ్రీ అర్హ‌త‌తో.. 9000 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్.. పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఎట్ట‌కేలకు అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త‌ను చెప్పింది. 9000 టెక్నీషియన్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడించింది. ఈ మేరకు రిక్రూట్‌మెంట్‌ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది.
Job openings in Indian Railways   Career opportunity in railways  Latest job vacancies in railways  Railway Recruitment Board announcement  9000 technician posts available

ఈ ఉద్యోగాల‌కు మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వ‌ర‌కు దరఖాస్తులను స్వీక‌రించ‌నున్న‌ది.

అర్హత‌లు ఇవే..
ఈ ఉద్యోగాల‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా పోస్టులను బట్టి మెట్రిక్యులేషన్‌, ఐటీఐ, డిప్లొమా/డిగ్రీ ఇన్‌ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 

ద‌ర‌ఖాస్తు ఫీజు :
జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.500, మహిళలు, ఎస్సీ, ఎస్టీ ఇతర రిజర్వేషన్‌ ఉన్న అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. 

☛ Indian Railway Jobs: 5,696 పోస్ట్‌లకు నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్...

ఎంపిక విధానం : 
అభ్యర్థులను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌-1, సీబీటీ-2, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్ట్‌ల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం : 
ఈ పోస్టులకు ఎంపికైన టెక్నీషియన్‌ గ్రేడ్‌-1 అభ్యర్థులకు రూ.29,200.. టెక్నీషియన్‌ గ్రేడ్‌-3 అభ్యర్థులకు రూ.19,900 వేతనం ఉంటుంది. అక్టోబర్‌/ డిసెంబర్‌లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు.. ఫిబ్రవరిలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నట్లు పట్నా రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) ప్రకటించింది.

చదవండి: RRB-Study Material

పోస్టుల వివరాలు ఇవే..

1. టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్: 1,100 పోస్టులు

2. టెక్నీషియన్ గ్రేడ్-III సిగ్నల్: 7,900 పోస్టులు

అభ్యర్థులను పూర్తి వివరాలకు https://indianrailways.gov.in/ లేదా https://www.rrbpatna.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Published date : 19 Feb 2024 07:57AM

Photo Stories