Skip to main content

Railway Jobs: రాత పరీక్ష లేకుండానే రైల్వేలో కొన్ని వేల ఉద్యోగాలు.. ఉండాల్సిన అర్హ‌త‌లివే..

దేశంలోని వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి సంబంధించి రైల్వే నియామక సంస్థలు ఇటీవల ప్రకటనలు విడుదల చేశాయి.
Railway Apprentice Recruitment  Join the Railways: Apprentice Recruitment

అన్ని రైల్వే సెంట్ర‌ల్స్‌లో క‌లిపి మొత్తం 6608 పోస్టులు ఉన్నాయి. ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే 1,832, నార్త్‌ సెంట్రల్‌ రైల్వే 1,697, నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వే 1,104, కొంకణ్ రైల్వే 190, సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే 1,785 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి.

ఈస్ట్‌ సెంట్రల్ రైల్వేలోని పోస్టుల‌కు డిసెంబ‌ర్ 12, నార్త్ సెంట్రల్ రైల్వేలోని పోస్టుల‌కు డిసెంబ‌ర్ 14, నార్త్ ఈస్ట్రన్ రైల్వేలోని పోస్టుల‌కు డిసెంబర్ 24, సౌత్‌ ఈస్ట్రన్ రైల్వేలోని పోస్టుల‌కు డిసెంబర్ 28లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.  

Gurukula School jobs: గురుకుల పాఠశాలలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు అరుహులు. దరఖాస్తు ఫీజు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపునిచ్చారు. అభ్యర్థులను పదో తరగతి, ఐటీఐ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, ధ్రువ పత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

➤ ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మెకానిక్, వైర్‌మ్యాన్, బ్లాక్ స్మిత్, ప్లంబర్, డ్రాట్స్‌మన్, స్టెనోగ్రాఫర్ తదితర ట్రేడ్‌లు ఉన్నాయి. 

➤  15 నుంచి 24 సంవత్సరాల వ‌య‌స్సు ఉన్న అభ్యుర్థులు అరుహులు.  ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో పరిమితి ఉంది.

Mega Job Mela: డిసెంబర్‌ 2న మెగా జాబ్‌ మేళా.. ఉండాల్సిన అర్హ‌త‌లు ఇవే..

Published date : 02 Dec 2023 10:07AM

Photo Stories