B.Tech Results 2023: బీటెక్ ఫలితాలు విడుదల
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో ఆగస్టులో నిర్వహించిన బీటెక్ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–20 రెగ్యులర్), (ఆర్–19 రెగ్యులర్), మూడో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–20, 19, 15) సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ ఇ.కేశవరెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ బి.చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. ఫలితాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో తెలుసుకోవాలని కోరారు.
చదవండి: Jobs in Govt Degree College: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ గెస్ట్ లెక్చరర్ పోస్టులు
గెస్ట్ టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
పరిగి: మండలంలోని కొడిగెనహళ్లి ఏపీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో ఖాళీగా ఉన్న సబ్జెక్టులకు గెస్ట్ టీచర్ల పోస్టుల భర్తీకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎన్వీ మురళీధర్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో 2023–24 విద్యా సంవత్సరానికిగానూ టీజీటీ గణితం, టీజీటీ సైన్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. డిగ్రీలో 50 శాతం మార్కులతో పాటూ బీఈడీలో 50 శాతం మార్కులు సాధించిన వారు మాత్రమే అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను అక్టోబర్ 9 తేదీ లోపు ఏపీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాల కార్యాలయం, కొడిగెనహళ్లిలో సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు 87126 25065 నంబరును సంప్రదించాలన్నారు.