Skip to main content

EdCET Result 2023: ఎడ్‌సెట్‌లో తేజస్వినికి 4వ ర్యాంక్‌

ap edcet results 2023

రాయవరం: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్షలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన కంచుమర్తి తేజస్విని రాష్ట్ర స్థాయి 4వ ర్యాంక్‌ కై వసం చేసుకుంది. గణితం విభాగంలో 150 మార్కులకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలో తేజస్విని 90 మార్కులు సాధించి ఓపెన్‌ కేటగిరీలో ఈ ర్యాంక్‌ సాధించింది. తాను ఉపాధ్యాయ శిక్షణ పొందుతానని, అయితే గ్రూప్‌–1 సాధించాలన్నది లక్ష్యమని ఈ సందర్భంగా తేజస్విని తెలిపింది. ఆమె తండ్రి సాయి కిషోర్‌ ప్రైవేటు ఉద్యోగి కాగా, తల్లి శారద గృహిణి.

EdCET Result 2023: ఎడ్‌సెట్‌లో అ‘ద్వితీయం’

Published date : 15 Jul 2023 04:09PM

Photo Stories