ఏపీ పీజీసెట్–21 కౌన్సెలింగ్ తేదీల సమాచారం
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం రెండోదశ కౌన్సెలింగ్‌లో ఫిబ్రవరి 17 నుంచి 19వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించినట్లు తెలిపారు. 21 నుంచి 24వ తేదీ వరకు ఆన్ లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యార్థులు వెబ్‌ఆప్షన్స్ ఫిబ్రవరి 25 నుంచి 27వ తేదీ వరకు ఇచ్చుకోవచ్చన్నారు. 28వ తేదీన విద్యార్థులకు సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులు మార్చి 2న కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. ఏపీపీజీసెట్ హాల్‌టికెట్, ర్యాంకు కార్డు, టీసీ, మార్కులిస్టులు, స్టడీ, రెసిడెన్స్ తదితర సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలని సూచించారు. మొదటి ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు అభ్యర్థులు వెబ్‌ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చని సూచించారు. వివరాలకు https://sche.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని కోరారు.
చదవండి:
Education: నాణ్యత, పరిశోధనలకు పెద్దపీట
తిరుపతిలో మరో కొత్త యూనివర్సిటీ