Skip to main content

NEET-PG 2022: నీట్‌–పీజీ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

NEET-PG 2022 notification

నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌సైన్సెస్‌(ఎన్‌బీఈఎంఎస్‌).. నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(నీట్‌) పీజీ–2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి
దరఖాస్తులు కోరుతోంది.

కోర్సులు: ఎండీ/ఎంఎస్‌/పీజీ డిప్లొమా; –పోస్ట్‌ ఎంబీబీఎస్‌ డీఎన్‌బీ/ఎన్‌బీఎంఎస్‌ డిప్లొమా
అర్హత: అభ్యర్థులు ఎంబీబీఎస్‌ డిగ్రీ/ప్రొవిజనల్‌ ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి.
ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ చట్టం 1956 ప్రకారం– శాశ్వత లేదా తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పరీక్షా విధానం: నీట్‌–పీజీ 2022 కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. మొత్తం 200 ప్రశ్నలకు 800 మార్కులు ఉంటాయి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 04.02.2022
అడ్మిట్‌ కార్డుల విడుదల: 07.03.2022
పరీక్ష తేది: 12.03.2022

వెబ్‌సైట్‌: https://nbe.edu.in/

చ‌ద‌వండి: NEET MDS 2022: దంత వైద్యంలో.. మాస్టర్స్‌

Last Date

Photo Stories