Skip to main content

Paramedical Admissions: డా.వైఎస్సార్‌ యూహెచ్‌ఎస్, విజయవాడలో బీఎస్సీ పారామెడికల్‌ ప్రవేశాలు

విజయవాడలోని డాక్టర్‌ వైఎస్సార్‌ యూని­వర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌.. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి కాంపిటెంట్‌ అథారిటీ కోటా కింద బీఎస్సీ పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
 Quota Admissions, BSc Paramedical Admission in Dr. YSRUHS, Vijayawada,Dr. YSR University of Health Sciences,

కోర్సుల వివరాలు: బీఎస్సీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ, బీఎస్సీ ఆప్టోమెట్రిక్‌ టెక్నాలజీ, బీఎస్సీ రీనల్‌ డయాలసిస్‌ టెక్నాలజీ, బీఎస్సీ పెర్ఫ్యూజన్‌ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియాక్‌ కేర్‌ టెక్నాలజీ అండ్‌ కార్డియో వాస్క్యులర్‌ టెక్నాలజీ, బీఎస్సీ అనెస్తీషియాలజీ టెక్నాలజీ అండ్‌ ఆపరేషన్‌ టెక్నాలజీ, బీఎస్సీ ఇమేజింగ్‌ టెక్నాలజీ, బీఎస్సీ ఎమెర్జన్సీ మెడికల్‌ టెక్నాలజీ, బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ.
వ్యవధి: నాలుగేళ్ల డిగ్రీ కోర్సు.
అర్హత: ఇంటర్మీడియట్‌(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బ­యాలజీ) లేదా ఇంటర్‌ ఒకేషనల్‌ బ్రిడ్జ్‌ కోర్సు/సార్వత్రిక విద్యలో ఇంటర్‌(ఫిజికల్‌ సైన్సెస్‌/బయోలాజికల్‌ సైన్సెస్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.12.2023 నాటికి 17 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

చ‌ద‌వండి: BPT Admissions: డా.వైఎస్సార్‌ యూహెచ్‌ఎస్, విజయవాడలో బీపీటీ ప్రవేశాలు

ఎంపిక విధానం: ఇంటర్‌ మార్కులు, రిజర్వేషన్‌ రూల్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 19.10.2023

వెబ్‌సైట్‌: https://drysruhs.edu.in/

Last Date

Photo Stories