Skip to main content

Admission in NID: ఎన్‌ఐడీలో బీడిజైన్‌ ప్రవేశాలు.. సీట్ల వివరాలు ఇవే..

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌(ఎన్‌ఐడీ).. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో బీడిజైన్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Bachelor Of Design (B.Des.) Admission in NID

ఎన్‌ఐడీ క్యాంపస్‌: ఆంధ్రప్రదేశ్, అహ్మదాబాద్, హర్యానా, మధ్యప్రదేశ్, అసోం.
కోర్సుల వివరాలు: నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌.
సీట్ల వివరాలు: అహ్మదాబాద్‌ క్యాంపస్‌లో 125 సీట్లు; ఏపీ, హర్యానా, మధ్యప్రదేశ్, అసోం క్యాంపస్‌లలో ఒక్కోదానిలో 75 సీట్లు ఉన్నాయి. విదేశీ విద్యార్థులకు అదనంగా సీట్లు కేటాయించారు.
స్పెషలైజేషన్‌: యానిమేషన్‌ ఫిల్మ్‌ డిజైన్, ఎగ్జిబిషన్‌ డిజైన్, ఫిల్మ్‌ అండ్‌ వీడియో కమ్యూనికేషన్, గ్రాఫిక్‌ డిజైన్, సిరామిక్‌ అండ్‌ గ్లాస్‌ డిజైన్, ఫర్నీచర్‌ అండ్‌ ఇంటీరియర్‌ డిజైన్, ప్రొడక్ట్‌ డిజైన్, టెక్స్‌టైల్‌ డిజైన్‌ తదితరాలు.
అర్హత: అభ్యర్థులు 01.07.2003 తర్వాత జన్మించి ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డుల నుంచి 2023 మే/ జూన్‌ నాటికి ఇంటర్‌ / పన్నెండో తరగతి(సైన్స్, ఆర్ట్స్, కామర్స్, హ్యుమానిటీస్‌ గ్రూపు) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

చదవండి: Training Course: ఏపీలో ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఫీమేల్‌) ట్రైనింగ్‌ కోర్సులో ప్రవేశాలు

ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 01.12.2023.
దరఖాస్తు సవరణ తేదీలు: 05.12.2023 నుంచి 07.12.2023 వరకు.
ప్రిలిమ్స్‌ తేది: 24.12.2023.
మెయిన్స్‌ తేది: 27.04.2023.

వెబ్‌సైట్‌: https://admissions.nid.edu/

Last Date

Photo Stories