APPSC-RIMC Admissions: ఎనిమిదో తరగతిలో ప్రవేశాలు.. పరీక్షా విధానం ఇలా..
అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2024 జూలై నాటికి ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.
వయసు: 01.07.2024 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా పదమూడేళ్లకు మించకుండా ఉండాలి. 02.07.2011 నుంచి 01.01.2013 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, వైవా వోస్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: రాతపరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. అవి మ్యాథమేటిక్స్(200 మార్కులు), జనరల్ నాలెడ్జ్(75 మార్కులు), ఇంగ్లిష్(125 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వైవావోస్(50 మార్కులు) నిర్వహిస్తారు. రాతపరీక్ష, వైవా వోస్ కలిపి మొత్తం 450 మార్కులకు కేటాయించారు. దీనిలో కనీస ఉత్తీర్ణత మార్కులు 50శాతం ఉండాలి. ఈ రెండింటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
చదవండి: 6th Class Admissions in Navodaya Vidyalaya: నాణ్యమైన విద్యకు.. నవోదయం
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఆర్‌ఐఎంసీ పంపిన దరఖాస్తు ఫారం నింపి అవసరమైన ధ్రువపత్రాలు జతచేసి అసిస్టెంట్ సెక్రటరీ(ఎగ్జామ్స్), ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, న్యూ హె డ్స్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్స్ బిల్డింగ్, రెండో అంతస్తు, ఆర్టీఏ కార్యాలయం దగ్గర, ఎంజీ రోడ్డు, విజయవాడ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 15.10.2023.
పరీక్ష తేది: 02.12.2023.
వెబ్‌సైట్: https://psc.ap.gov.in/