Skip to main content

AIISH Admission 2023: డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు..

దేశంలో చాలామంది చిన్నారులు వినికిడి లోపం, సరిగా మాట్లాడలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారికి స్పీచ్, హియరింగ్‌ నిపుణుల సేవలు చాలా అవసరం. ఈ విభాగాల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కోర్సులు ఉన్నాయి. ఇలాంటి కోర్సులను అందించడంలో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌(ఏఐఐఎస్‌హెచ్‌)కు మంచి పేరుంది. ఇక్కడ డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయిలో కోర్సులు అందిస్తున్నారు. వీటిలో ప్రవేశాలకు 2023-24 విద్యాసంవత్సరానికి ప్రకటన వెలువడింది. ఆ వివరాలు..
AIISH Admission 2023
  • కొనసాగుతన్న ఏఐఐఎస్‌హెచ్‌ 2023-24 దరఖాస్తులు 
  • డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు

డిప్లొమా కోర్సులు

  • డిప్లొమా ఇన్‌ హియరింగ్‌ ఎయిడ్‌ అండ్‌ ఇయర్‌ మౌల్డ్‌ టెక్నాలజీ; సీట్ల సంఖ్య: 28. అర్హత: ఫిజిక్స్‌తో ఇంటర్‌ లేదా ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌ బ్రాంచ్‌ల్లో డిప్లొమా/ఐటీఐ లేదా డెంటల్‌ టెక్నీషియన్‌ కోర్సు పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు సంబంధిత అర్హత పరీక్షల్లో కనీసం 50 మార్కులతో(ఎస్పీ, ఎస్టీలు 45 శాతం) మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 24 ఏళ్లలోపు ఉండాలి.
  • డిప్లొమా ఇన్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌: సీట్ల సంఖ్య: 28. అర్హత: ఏదైనా గ్రూప్‌తో ఇంటర్మీడియట్‌లో కనీ­సం 50 (ఎస్సీ, ఎస్టీలైతే 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 17 ఏళ్లు ఉండాలి. 
  • డిప్లొమా ఇన్‌ హియరింగ్, లాంగ్వేజ్‌ అండ్‌ స్పీచ్‌: ఈ కోర్సును ఏఐఐఎస్‌హెచ్‌తోపాటు 8 అనుబంధ సంస్థల్లో అందిస్తున్నారు. ఏఐఐఎస్‌హెచ్‌లో 30 సీట్లు, ఇతర చోట్ల 28 సీట్ల చొప్పు­న ఉన్నాయి. అర్హత: ఇంటర్‌లో ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్‌తో కనీసం 50(ఎస్సీ, ఎస్టీలు 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. వ­యసు జూలై 01 నాటికి 21ఏళ్లలోపు ఉండాలి. 
  • స్టైపెండ్‌: పై అన్ని కోర్సులకు ఎంపికైన వారికి నెలకు రూ.250 చొప్పున పదినెలల పాటు స్టైపెండ్‌ చెల్లిస్తారు.

చ‌ద‌వండి: Admission in NIFTEM: నిఫ్టెమ్‌లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు

బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులు

  • బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ(బీఏఎస్‌ఎల్‌పీ): అందుబాటులో ఉన్న సీట్లు: 80. అర్హత: ఇంటర్‌లో ఎంపీసీ లేదా బైపీసీ గ్రూపుతో కనీసం 50 శాతం (ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం) మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఎంపికైన వారికి మొదటి మూడేళ్లు ఏడాదికి పది నెలల పాటు నెలకు రూ.800 చొప్పున స్టైపెండ్‌ప చెల్లిస్తారు. నాలుగో ఏడాది ఇంటర్న్‌షిప్‌లో భాగంగా నెలకు రూ.5000 చొప్పున చెల్లిస్తారు.
  • బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌-స్పెషల్‌ ఎడ్యుకేషన్‌(హియరింగ్‌ ఇంపెయిర్‌మెంట్‌): సీట్ల సంఖ్య 22. అర్హత: ఏదైనా డిగ్రీలో కనీసం 50 శాతం(ఎస్సీ, ఎస్టీ 45శాతం) మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థి వయసు జూలై 1 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి. ఈ కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. ఇందులో ప్రవేశం పొందిన వారికి నెలకు రూ.400 చొప్పున ఏటా పదినెలల పాటు స్టైపెండ్‌ అందుతుంది.

చ‌ద‌వండి: DOST Notification 2023: దోస్త్‌ నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్‌ షెడ్యూల్‌ విడుదల..

మాస్టర్‌ డిగ్రీ కోర్సులు

  • ఎమ్మెస్సీ(స్పీచ్‌-లాంగ్వేజ్‌ పాథాలజీ): సీట్ల సంఖ్య 44. అర్హత: బీఎస్సీ(స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌)/బీఏఎస్‌ఎల్‌పీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు. ఎంపికైన వారికి నెలకు రూ.1300 చొప్పున ఏడాదిలో పది నెలలపాటు రెండేళ్లు స్టయిపెండ్‌ చెల్లిస్తారు.
  • ఎమ్మెస్సీ(ఆడియాలజీ): సీట్ల సంఖ్య 44. అర్హత: బీఎస్సీ(బీఎస్సీ అండ్‌ హియరింగ్‌)/బీఏఎస్‌ఎల్‌పీ కోర్సు వ్యవధి రెండేళ్లు. స్టైపెండ్‌: ఎంపికైన వారికి నెలకు రూ.1300 చొప్పున ఏడాదిలో పది నెలల పాటు రెండేళ్లు చెల్లిస్తారు.
  • స్పెషల్‌ ఎంఎడ్‌: మొత్తం సీట్ల సఖ్య 22. అర్హత: బీఎడ్‌ లేదా స్పెషల్‌ బీఎడ్‌ కనీసం 50(ఎస్సీ, ఎస్టీలు 45 శాతం) శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. వయసు: జూలై 1 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలి. ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు. స్టైపెండ్‌: ఎంపికైన వారికి నెలకు రూ.650 చొప్పున ఏడాదిలో పది నెలల పాటు రెండేళ్లు చెల్లిస్తారు.
  • పీహెచ్‌డీ: స్పీ^Œ -లాంగ్వేజ్‌ పాథాలజీ, ఆడియాలజీ, స్పీచ్‌ అంyŠ హియరింగ్, స్పెషల్‌ ఎడ్యుకేషన్, లింగ్విస్టిక్స్‌ అంశాల్లో పీహెచ్‌డీ కోర్సులు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో 55 శాతం మార్కులతో పీజీ పూర్తిచేసినవారు వీటికి అర్హులు. స్టైపెండ్‌: ఎంపికైన వారికి మొదటి ఏడాది నెలకు రూ.20వేలు, రెండో ఏడాది నెలకు రూ.22 వేలు, మూడో ఏడాది నెలకు రూ.25 వేలు చొప్పున స్టైపెండ్‌ అందిస్తారు. పోస్టు డాక్టోరల్‌ ఫెలోషిప్‌లో చేరినవారికి ప్రతి నెల రూ.35 వేల చొప్పున చెల్లిస్తారు. ఏటా కాంటింజెన్సీ గ్రాంట్‌ ఉంటుంది.

చ‌ద‌వండి: CPGET 2023 Notification: పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
  • దరఖాస్తులకు చివరి తేదీ: మే 31, 2023
  • పరీక్ష తేదీ: జూన్‌ 25, 2023
  • వెబ్‌సైట్‌: http://aiishmysore.in/
Last Date

Photo Stories