Skip to main content

ఏపీ ట్రిపుల్ ఐటీ: ఆర్‌జీయూకేటీ సెట్ నోటిఫికేషన్ 2021

ఏపీలో ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీల్లో సీట్ల కేటాయింపు జరుగుతుంది.

సాధారణంగా ప్రతీ ఏటా పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలు నిర్వహిస్తారు. అయితే కరోనా నేపథ్యంలో ప్రవేశాల కోసం ప్రత్యేక పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రవేశ పరీక్ష నిర్వహించి వచ్చిన మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివ‌రాలు...
  • ఏపీ ట్రిపుల్ ఐటీ ఆర్‌జీయూకే సెట్ నోటిఫికేషన్ 2021

కోర్సుల వివ‌రాలు....
ఆరు సంవ‌త్స‌రాల ఇంటిగ్రేటెడ్ ఇంజ‌నీరింగ్ కోర్సులను రెండు ద‌శ‌లుగా విభ‌జించారు
ప్రీ యూనివ‌ర్సిటీ కోర్సులు(2 సంవ‌త్స‌రాలు):
  • మ్యాథ‌మెటిక్స్‌
  • ఫిజిక్స్‌
  • కెమిస్ట్రీ
  • ఇంగ్లీష్‌
  • తెలుగు /సంస్కృతం
  • ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ
  • బ‌యోల‌జీ

బీటెక్ (4 సంవ‌త్స‌రాలు):
  • కెమిక‌ల్ ఇంజ‌నీరింగ్‌
  • సివిల్ ఇంజ‌నీరింగ్‌
  • కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజ‌నీరింగ్‌
  • ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజ‌నీరింగ్
  • ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజ‌నీరింగ్‌
  • మెట‌ల‌ర్జిక‌ల్ అండ్ మెటీరియ‌ల్స్‌ ఇంజ‌నీరింగ్‌
  • మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్‌

అర్హ‌త‌: పదోతరగతి పూర్తయిన విద్యార్థులు ఇందులో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ద‌ర‌ఖాస్తుల‌కు ప్రారంభతేది: ఆగ‌స్టు 20, 2021
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: సెప్టెంబ‌ర్ 06, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: www.rgukt.in

Photo Stories