Skip to main content

AP College of Journalism: ఏపీ కాలేజీ ఆఫ్‌ జర్నలిజంలో ప్రవేశాలు.. ముఖ్యతేదీలు..

Admissions in AP College of Journalism

హైదరాబాద్‌లోని ఏపీ కాలేజీ ఆఫ్‌ జర్నలిజం.. 2022–23 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ గుర్తింపు పొందిన వివిధ జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

కోర్సులు–అర్హతలు
పీజీ డిప్లొమా ఇన్‌ జర్నలిజం(పిజిడిజె): 
ఈ కోర్సు వ్యవధి 12 నెలలు. 
కనీస విద్యార్హత.. డిగ్రీ. 

డిప్లొమా ఇన్‌ జర్నలిజం(డిజె): 
ఈ కోర్సు వ్యవధి ఆరు నెలలు. 
కనీస విద్యార్హత.. డిగ్రీ. 

డిప్లొమా ఇన్‌ టీవీ జర్నలిజం(డిటివిజె): 
ఈ కోర్సు వ్యవధి ఆరు నెలలు. 
కనీస విద్యార్హత.. డిగ్రీ. 

సర్టిఫికెట్‌ కోర్స్‌ ఆఫ్‌ జర్నలిజం(సిజె): 
ఈ కోర్సు వ్యవధి మూడు నెలలు. కనీస విద్యార్హత పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
పై కోర్సుల్ని రెగ్యులర్‌ గాను, కరస్పాండెన్స్‌ పద్ధతి(దూరవిద్య)లోనూ చేయొచ్చు. ఆన్‌లైన్‌ తరగతుల సౌకర్యం ఉంది. ఇంటి దగ్గర నుంచే పాఠ్యాంశాలు లైవ్‌లో వినవచ్చు. తెలుగు లేదా ఇంగ్లిష్‌ను బోధనా మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్లు జరుగుతున్నాయి. 

ముఖ్యతేదీలు
దరఖాస్తు విధానం: కళాశాల వెబ్‌సైట్‌ (https://apcj.in/) ద్వారా పేరు రిజిస్టర్‌ చేసుకోవచ్చు. 
దరఖాస్తులకు చివరి తేది: 05.08.2022
అడ్మిషన్లు పొందటానికి చివరి తేది:12.08.2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://apcj.in/

Photo Stories