Skip to main content

క్యాట్ ప్రిపరేషన్ కలిసొచ్చింది

ఐసెట్ 2013 నాల్గో ర్యాంకర్ పి.ఎస్.సంతోషకుమార్
సమయాన్ని వృథాచేయకుండా ప్రయత్నం చేస్తున్నపుడు ఆశించిన అందలాన్ని ఎక్కగలమంటున్నాడు పి.ఎస్.సంతోష్‌కుమార్. ఐసెట్ 2013లో 173 మార్కులు సాధించిన స్టేట్‌ఫోర్త్ ర్యాంకు సాధించాడు. ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూనే... రాత్రిళ్లు చదివి టాపర్‌గా నిలిచాడు. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తండ్రి నుంచి అలవ డిన క్రమశిక్షణతో తాను ర్యాంకు వరించిదని.. రాబోయే రోజుల్లో ఉన్నతస్థానాన్ని చేరగలననే ఆత్మవిశ్వాసం వ్యక్తంచేస్తున్నాడు.

మాది విశాఖపట్టణం వద్ద పెందుర్తి. నాన్న సత్యనారాయణ కానిస్టేబుల్, అమ్మ గృహిణి. పదోతరగతిలో 519, ఇంటర్ 961 మార్కులు తెచ్చుకున్నా. చదువంతా పూర్తిగా విశాఖలోనే సాగింది. ఎంసెట్‌లో 1126వ ర్యాంకుతో ఇంజనీరింగ్‌లో చేరా. క్యాట్ రాసేందుకు చదివిన సబ్జెక్టు ఐసెట్‌లో చక్కగా ఉపకరించింది. కోల్‌కత్తా ఐ.ఐ.ఎంలో సీటు సంపాదించాలే లక్ష్యంతో చదువుతున్నా.

ఏవైనా పోటీపరీక్షల్లో విజయం వరించాలంటే.. నామకేవాస్తుగా చదివితే సరిపోదు. సబ్జెక్టులకు సంబంధించిన అంశాలను విశ్లేషించుకోవాలి. ప్రశ్న ఎలా ఇచ్చినా జవాబు ఇచ్చేందుకు రెడీగా ఉన్నపుడే సీటు సాధించగలమనేది నా సలహా.

Published date : 01 Jun 2013 04:51PM

Photo Stories