వీరు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఐఈఎస్‌లో 12వ ర్యాంక్ సాధించాను...
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) పరీక్షలో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన నూకల సాయి వికాస్ 12వ ర్యాంకు సాధించాడు.

అతని తండ్రి నూకల వెంకటేశ్వర్లు మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు అధికారిగా పనిచేస్తూ 15 రోజుల క్రితమే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (ఎస్పీ)గా పదోన్నతి పొందారు. చిన్నప్పటి నుంచే చదువులో విశేష ప్రతిభ కనబరిచే 23 ఏళ్ల సాయి వికాస్ ఐఐటీ బాంబే నుంచి ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. టెన్త్ లో 9.8 జీపీఏ, ఇంటర్‌లో 97.6శాతం, జేఈఈలో 738వ ర్యాంకు సాధించాడు. ఐఈఎస్ సాధించాలనే పట్టుదలతో రెండోసారి పరీక్ష రాసి అఖిల భారత స్థాయిలో 12వ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా సాయి వికాస్ మాట్లాడుతూ.. తన విజయానికి తల్లిదండ్రులు, తన సోదరి, తాత రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయుడు నూకల సైదులు ఇచ్చిన ప్రోత్సాహమే కారణమన్నారు.
Published date : 15 Apr 2021 04:07PM