గిరిజన ఆణిముత్యం.. ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
కూలీవాడని తోటి సమాజం తూట్లు పొడుస్తున్నప్పటీకి కుంగిపోకుండా మౌనంగా ముందుకు సాగి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఎదిగాడు.
కూలీ పనులకు వెళి్ల...
కేరళలోని కాసర్‌గోడ్ జిల్లా కొలిచల్ గ్రామం బినేష్ సొంతూరు. కూలీనాలి చేసుకుని జీవనం సాగించే మావిలాన్ గిరిజన కుటుంబంలో బినేష్ జన్మించాడు. నిరుపేద కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచే తనుకూడా కూలీ పనులకు వెళ్లి కుటుంబానికి సాయం చేస్తూ శ్రద్ధగా చదువుకునేవాడు. బినేష్ నాలుగోతరగతి చదివేటప్పుడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజపురం టౌన్ లో ఇంటర్నెట్ కేఫ్‌లో వీడియోగేమ్‌లు ఆడేందుకు ఎంతో ఇష్టంగా వెళ్లేవాడు. అప్పుడే అతనికి కంప్యూటర్స్‌పై మక్కువ ఏర్పడింది.
స్కూల్లో టీచర్లు సైతం...
అప్పటి నుంచి కంప్యూటర్ నేర్చుకోవాలనే తపన అతడిలో పెరిగింది. దీంతో కంప్యూటర్ సంబంధిత పుస్తకాల ద్వారా కొంత, నెట్‌లో కొంత వెతికి భిన్నమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడంతోపాటు, కంప్యూటర్ ఆపరేట్ చేయడం పూర్తిగా నేర్చుకున్నాడు. ఇతర సబ్జెక్టుల కంటే కంప్యూటర్‌నే ఎక్కువగా ఇష్టపడేవాడు. కాలం గడుస్తున్న కొద్దీ కంప్యూటర్‌లో ఆరితేరి క్లాస్ లో దిబెస్ట్‌గా నిలిచాడు. దీంతో స్కూల్లో టీచర్లు సైతం కంప్యూటర్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే తననే సంప్రదించేవాళ్లు. ఆ తర్వాత ఎకనమిక్స్‌లో డిగ్రీ పూర్తిచేసి ఎంబీఏలో చేరాడు.
డబ్బులు సరిపోకపోవడంతో...
కూలిపని చేసుకుంటూనే ఎంబీఏ పూర్తిచేసిన బినేష్ అనేక ఆటంకాలను అధిగమించి కేంద్ర ప్రభుత్వ అందించే స్కాలర్‌షిప్ సాయంతో యూకేలోని సస్సెక్స్ యూనివర్శిటీలో చదువుకోవడానికి వెళ్లాడు. స్కాలర్‌షిప్ డబ్బులు సరిపోకపోవడంతో ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు క్లీనింగ్ బాయ్‌గా పనిచేసి తన చదువును కొనసాగించాడు. చదువు పూర్తయ్యాక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా జీవితం ప్రారంభించాడు. ఎప్పటికై నా స్టార్టప్ స్థాపించాలని అనుకున్న బినేష్ ... తన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెన్ బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్(రెక్స్‌చేంజ్)ను అభివృద్ధి చేసి విజయం సాధించాడు.
రెక్స్‌చేంజ్ సాఫ్ట్‌వేర్..
తన కొలీగ్ అరుున ఇడుక్కితో కలిసి ఫ్యూచర్ జనరేషన్ ్సకు ఉపయోగపడే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసేందుకు బినేష్ కృషిచేశాడు. ప్రస్తుతం మన దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ల మాదిరిగా ఇది పనిచేయదు. రెక్స్‌చేంజ్ డబ్బువిలువను భారతీయ రూపాయల్లో కాకుండా, రెసిప్రొసిటీ లేదా ఆర్‌వీ అనే డిజిటల్ విలువలో నిల్వచేస్తుంది. ఆర్‌వీని ఉంచే ఖాతాను కూప్ బ్యాంక్ అకౌంట్ నంబర్(సీబీఏఎన్ ) అనిపిలుస్తారు.
ఇది యూరో డాలర్, పౌండ్ వంటి అధిక విలువ కలిగిన కరెన్సీ విలువలను నిల్వ చేయగలదు. అంతేగాక ఇండియన్ కరెన్సీలో విత్‌డ్రా చేసుకోవచ్చు. సీబీఎన్ ఖాతా రెక్స్‌చేంజ్ యాప్ ద్వారా మాత్రమే పనిచేస్తుంది. ఇటీవల ప్రారంభించిన ఈ యప్‌ను ఇప్పటికే 70 మందికిపైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. ఆర్‌వీ విలువను లైవ్ రెక్స్‌చేంజ్ రేట్(ఎల్‌ఆర్‌ఆర్) నిర్ణరుుస్తుంది. సీబీఎన్ ఖాతాల సంఖ్య పెరుగుదల ప్రకారం ఎల్‌ఆర్‌ఆర్ పెరుగుతుంది. 2019 నుంచి అమ్‌స్టర్‌డమ్ యూనివర్శిటీలో సామాజిక, సాంసృ్కతిక ఆంథాలజీ మీద బినేష్ పరిశోధనలు చేస్తున్నాడు.