ర్యాంకుల వర్షం... హర్షకు సాధ్యం
Sakshi Education
ఆ అబ్బాయికి కార్లంటే మక్కువ ఎక్కువ. చిన్నప్పుడు రోడ్ల మీద కారు పరుగులు తీస్తుంటే అది ఎలా దూసుకెళ్తుందా? అని అదేపనిగా ఆలోచించేవాడు. ఆ ఆసక్తి కొన్నాళ్లకు అల్లంత దూరంలో వెళ్తున్న కారు హెడ్ లైట్‌ను చూసి దాని పేరు చెప్పడంలో నేర్పరిగా మలచింది. అలాని కారంటే మోజు కాదు. దానికి పరుగులు పెట్టించే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అందుకు మూల కారణమేంటనే లోతైన యోచనే. ఆ ఆలోచనా శక్తే ఇంజనీర్ కావాలనే తపనకు బీజం వేసిందని, అఖిల భారత స్థాయిలో జేఈఈ మెయిన్‌లో తొమ్మిదో ర్యాంక్‌ను సాధించేలా చేసిందంటున్నాడు మాగంటి నిఖిల్ హర్ష.
కుటుంబ నేపథ్యం:
మాది ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్ గ్రామం. నాన్న నాగేశ్వరరావు మెదక్‌లోని మైలాన్ ఫ్యాక్టరీలో ఉద్యోగి. అమ్మ మంజుల గృహిణి. చదువంటే వారికి ప్రాణం. మధ్యతరగతి కుటుంబం. ఒక్కగానొక్కడిని కావడంతో నేనే వారి జీవితమయ్యాను.
ఆ బ్యాడ్జి కోసం:
చిన్నప్పుడు తరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన వారికి ‘క్లాస్ ఇన్ ఫస్ట్, క్లాస్ లీడర్ ‘అనే బ్యాడ్జిని చొక్కాకు పెట్టేవారు. దానికోసం అందరికంటే ముందుండాలనే తపనతో చదివేవాణ్ని. అలా పోటీతత్వం బాల్యం నుంచే అలవడింది.
అమ్మా, నాన్న ప్రోత్సాహం:
నా వెన్నంటి ఉంటూ అమ్మానాన్న అందించిన ప్రోత్సాహం మరువలేనిది. నాకు కాలేజీ దూరం కాకూడదని, నాన్న ఆఫీసుకు 40 కిలోమీటర్లు దూరమైనా కాలేజీ దగ్గరలోనే ఇంటిని అద్దెకు తీసుకునే వారు. ఇక అమ్మ నా చదువు కోసం ఉద్యోగం మానేసింది. ఏనాడూ ఎలాంటి కష్టం అన్నది తెలియకుండా చదివించారు. నా కోసం వారెంతో శ్రమకోర్చారు.
పోటీపరీక్షలంటే ఇష్టం:
ఎక్కడైనా పోటీ పరీక్షలు నిర్వహిస్తే చాలు. అందులో పాల్గొనే వాడిని. అమ్మానాన్నలు సైతం మద్దతు తెలిపేవారు. ఒక కోచింగ్ సెంటర్ నిర్వహించిన పరీక్షలో ప్రతిభ కనబరిచినందుకు రూ.10వేల విలువైన పుస్తకాలను అందజేశారు. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ఇన్ఫోసిస్‌లో శిక్షణ తరగతులకు ఎంపికయ్యాను. ఇలా ప్రతిభతో ఏదైనా సాధించగలననే నమ్మకం ఏర్పడింది.
ఇంటర్‌లోనే ఐఐటీ పునాది:
నా ఐఐటీ ప్రస్థానంఇంటర్‌లోనే ప్రారంభమైంది. ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు ఐఐటీ తరగతులు జరిగేవి. అనంతరం పదిన్నర వరకు ఐఐటీ ఎంట్రన్‌సపై పరీక్షలు నిర్వహించేవారు.
అన్ని పరీక్షలకూ ఒకేసారి:
ఇంటర్ పరీక్షలు ముగిశాక ఎంసెట్, ఐఐటీ, జేఈఈ పరీక్షలకు ఒకేలా ప్రిపేర్ అయ్యాను. కళాశాలలో రోజూ నిర్వహించే నమూనా పరీక్షల్లో మొదటి 20 స్థానాల్లో ఉండే వాణ్ని. అన్ని పరీక్షలను దృష్టిలో పెట్టుకొని మొదటిసారి చదివినప్పుడుఇదే చివరిసారి కాదనే ధోరణితో ప్రతి టాపిక్‌ను విశ్లేషణాత్మకంగా చదివాను. ఉదయం ఆరు నుంచి రాత్రి పదిన్నర వరకు మధ్యమధ్యలో విరామంతో ప్రిపేర్ అయ్యాను.
ఉపకరించిన గ్రాండ్ టెస్టులు:
20 గ్రాండ్ టెస్ట్‌లు రాశాను. వీటి సాయంతో పరీక్షలు ఎలా రాయాలనేది తెలిసింది. ఏ అంశాల్లో పొరపాట్లు తలెత్తుతున్నాయో తెలుసుకునే వీలు కలిగింది. దీంతో తప్పులను పునరావృతం కాకుండా చూసుకున్నాను. ప్రిపరేషన్‌లో సబ్జెక్టుల పరంగా తలెత్తిన సందేహాలను అధ్యాపకుల సాయంతో నివృత్తి చేసుకున్నాను.
ఆస్వాదిస్తూ చదవాలి:
చదువంటే ఇష్టం పెంచుకోవాలి. ఏ విషయాన్నైనా ఆసక్తితో ఆకళింపు చేసుకోవాలి. ప్రతి అంశాన్నీ విశ్లేషణ, విమర్శనాత్మక దృక్పథం తో చదివితే ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది. తార్కికశక్తి అలవడుతుంది. ఈ సూత్రం పాటించే వారికి జేఈఈ కష్టమేమీ కాదు.
పది మందికి ఉపాధి:
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్‌లో సీటు వచ్చింది. దాన్ని పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం. అనంతరం సొంతంగా వ్యాపారం ప్రారంభించి పది మందికి ఉద్యోగావకాశాలను కల్పిస్తా.
అకడమిక్ ప్రొఫైల్:
టెన్త్: 9.8
ఇంటర్: 987 మార్కులు
ఎంసెట్: 13వ ర్యాంక్
జేఈఈ అడ్వాన్స్‌డ్: 245 ర్యాంక్
జేఈఈ మెయిన్: 9వ ర్యాంక్

Published date : 01 Aug 2014 02:22PM