Skip to main content

కష్టపడి చదివితే సాధించలేనిది ఏదీ లేదు: ఆశిష్, JEE Main- B.Arch. Topper

మామూలు మధ్యతరగతి కుటుంబానికి చెందిన పిల్లలకు తల్లిదండ్రులు, అధ్యాపకులు తగినంత ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు చేస్తారని నిరూపించాడు కోరుప్రోలు ఆశిష్. ఐఐటిలో ఇంజనీరింగ్ ధ్యేయంగా చదివిన అతను జెఇఇ-మెయిన్స్‌లో 118 ర్యాంకు సాధించటంతో పాటు ఆర్కిటెక్చర్ విభాగంలో మొదటి స్థానం పొందాడు. తన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్న ఆశిష్‌ని సాక్షిఎడ్యుకేషన్.కామ్ పలకరించింది. అతని విజయరహస్యం, ఇతర వివరాలు మీకోసం...

కుటుంబ నేపథ్యం: మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్నగారు కెవివిఎస్‌ఎస్ గుప్తా ఐబిఎంలో ప్రాజెక్టు మేనేజరుగా పని చేస్తున్నారు. అమ్మ అన్నపూర్ణ గృహిణి. తమ్ముడు వరుణ్ గీతాంజలి దేవాశ్రయ్ స్కూలులో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. నేనూ పదవ తరగతి వరకూ అక్కడే సిబిఎస్‌ఇ సిలబస్‌లో చదువుకున్నాను. అక్కడ నేర్పిన బేసిక్స్ నాకు బాగా ఉపయోగపడ్డాయి.

జెఇఇ ప్రిపరేషన్ గురించి: మా కాలేజి యాజమాన్యమే మా టైమ్ టేబుల్ ప్లాన్ చేసేది. ఉదయం 6గంటల నుండి రాత్రి పదిన్నర వరకూ కాలేజీలోనే చదువుకునే వాళ్లం. రెగ్యులర్ క్లాసులతో పాటు స్టడీ అవర్స్, ఇతర టెస్టులతో పాటు డౌట్స్ క్లారిఫికేషన్ కూడా ఉండేది.

జెఇఇలో మెరుగైన ప్రదర్శనకు బుక్స్: ఐఐటిలో సీటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు క్లాస్ నోట్స్, కాలేజీ మెటీరియల్ మాత్రమే సరిపోవు. అవేకాక NCERT, తెలుగు అకాడమీ పుస్తకాలను తప్పకుండా చదవాలి. వాటిలో ప్రతి సబ్జెక్టు బేసిక్స్ నుంచి కాన్సెప్ట్స్ ఉంటాయి. వీటన్నిటితో పాటు మా టీచర్స్ సలహా వల్ల ప్రతి సబ్జెక్టుకి నేను మరికొన్ని పుస్తకాలను చదివాను. అవి..

ఫిజిక్స్ కోసం: ఫిజిక్స్ పాఠాలను శ్రీ ఎం.పి. సింగ్ గారు మాకు బోధించారు. ఆయన స్వతహాగా జీనియస్ కావటం వలన కాన్సెప్ట్స్ మాకూ ఈజీగా అర్ధమయ్యేవి. ఆయన ఇచ్చిన నోట్స్‌తో పాటు ఈ బుక్స్ కూడా నేను ఫాలో అయ్యాను.
Concepts of Physics, by H.C.Verma
New Pattern IIT JEE Physics, by D.C. Pandey
Problems in General Physics, by IE Irodov
Aptitude Test Problems In Physics, by S.S. Krotov
Puzzling Physics Problems: With Hints and Solutions
Fundamentals of Physics by Halliday-Resnick-Walker

మాథ్స్ కోసం:మా టీచర్ అశ్వత్థరావు గారు ఎలాంటి లెక్కలైనా బాగా అర్ధమయ్యేలా చెప్తారు. మొదట్లో నేను కొంచెం ఇబ్బంది పడినా క్లాస్ నోట్స్, ఎసైన్‌మెంట్స్ సహాయంతో త్వరగానే స్పీడ్ అందుకున్నాను. మా సర్ చెప్పినవే కాకుండా Mathematics for Class XI & XII by RD Sharma ఎక్కువగా రిఫర్ చేశాను.

కెమిస్ట్రీ: గ్రూపు సబ్జెక్టులన్నింటిలో నాకు ఇష్టమైన సబ్జెక్టు కెమిస్ట్రీ. ఎనిమిదవ తరగతి నుంచి ఆ సబ్జెక్టుపై ప్రేమ మొదలైందని చెప్పొచ్చు. జెఇఇలో కెమిస్ట్రీ మూడు భాగాలుగా ఉంటుంది.
  1. ఫిజికల్ కెమిస్ట్రీ
  2. ఆర్గానిక్ కెమిస్ట్రీ
  3. ఇనార్గానిక్ కెమిస్ట్రీ

ఫిజికల్ కెమిస్ట్రీ కోసం వివేక్ గుప్తా గారు ఇచ్చిన క్లాస్ నోట్స్‌తో పాటు
Concepts Of Physical Chemistry,
by Dr P Bahadur
Numerical Chemistry, by N. Avasthi and V.K Jaiswal
Physical Chemistry, by Peter Atkins కూడా చదివాను.

ఆర్గానిక్ కెమిస్ట్రీని ప్రసాద్ గారు, కిషోర్ గారు మాకు బోధించారు. వారిచ్చిన నోట్స్, మెటీరియల్‌తో పాటుగా
Organic Chemistry
by Wade
Reactions, Rearrangements & Reagents by S. N. Sanyal
Advanced Problems in Organic Chemistry by Himanshu Pandey
Organic Chemistry for JEE by M. S. Chouhan కూడా ప్రిపేరయ్యాను.

మా మేడం మాధవి దీపక్ గారు ఇనార్గానిక్ కెమిస్ట్రీ బాగా చెప్తారు. ఆవిడ ఇచ్చిన నోట్స్‌తో పాటుగా
Inorganic Chemistry
by O.P. Tandon,
Conceptual Inorganic Chemistry by Prabhat Kumarని చదవటం నాకు బాగా సహాయం చేసింది.

చదువులో పేరెంట్స్ సహాయసహకారాలు: నేను ఎప్పుడు ఏమి పొందినా అవన్నీ మా అమ్మ నాన్న సహకారంతో సాధించినవే. వాళ్లు లేకుండా నేను ఏమీ చేయగలిగేవాడిని కాదు. మా అమ్మానాన్నలు, తమ్ముడు సపోర్ట్ ఉంటే నేను ఏదైనా సాధించగలను. ఫ్రెండ్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్లందరికీ నేను థాంక్స్ చెబుతున్నాను.

ఐఐటి లక్ష్యంగా చదివే విద్యార్థులకు సలహా:
మంచి ర్యాంకు రావాలంటే చాలా కష్టపడి చదవాలి. ఎన్ని గంటలు చదివామనే దానికన్నా ఎంత నేర్చుకునేలా చదివామనేది ముఖ్యం. టార్గెట్ పెట్టుకుని ప్లాన్ ప్రకారం చదివితే పరీక్ష సమయంలో ఈజీగా ఉంటుంది.
ఆశిష్ సాధించిన మార్కులు, ర్యాంకులు
  • 10th (CBSE): 10GPA
  • Inter: 984/1000 Marks
  • IIIT Hyderabad: Seat in CSE
  • VIT: 180 Rank
  • BITS: 402/450 Marks
  • GITAM Admission Test (GAT 2014): All India 5th Rank
Published date : 16 Jul 2014 01:00PM

Photo Stories