MBBS Admissions: SIMSలో ఎంబీబీఎస్ అడ్మిషన్లు
2023–24 విద్యాసంవత్సరానికిగాను ఎంబీబీఎస్ ఫస్టియర్‌లో 150 మంది విద్యార్థులు చేరనున్నారు. విద్యార్థుల సర్టిఫికెట్ల వెరి ఫికేషన్ ప్రక్రియను సిమ్స్ అధికారులు ఆగస్టు 24న చేపట్టారు. ఆల్ ఇండియా కోటాలో 12 మంది, స్టేట్ కోటాలో 8 మంది సిమ్స్‌లో చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఎనిమిది మంది విద్యార్థులు ప్రిన్సిపాల్ హిమబింద్‌సింగ్‌ను సంప్రదించగా.. వైస్ ప్రిన్సిపాల్ నరేందర్‌తో కలిసి అభినందించారు.
చదవండి: New Medical College: వైద్య విద్యకు వేళాయె..
జాతీయ స్థాయిలో 22 మంది విద్యార్థులు
ఈ విద్యా సంవత్సరంలో సిమ్స్‌లో 150 సీట్లు కేటాయిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల నీట్ ద్వారా ఓపెన్ ఫర్ ఆల్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. జాతీయస్థాయి కౌన్సెలింగ్ ద్వారా వివిధ రాష్ట్రాలకు చెందిన 22 మంది విద్యార్థులను సిమ్స్‌కు కేటాయించినట్లు మెయిల్ ద్వారా సమాచారం వచ్చింది. ఇప్పటివరకు 12 మంది రాజస్థాన్, బిహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల వారు ఉన్నారు.
చదవండి: Admissions: మెడికల్ కళాశాలలో సీట్లభర్తీ షురూ
మిగిలిన 128 మంది స్టేట్ జాబితాను కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనుంది. శనివారం వరకు కౌన్సెలింగ్‌కు గడువు ఉండడంతో విద్యార్థులు నచ్చిన కళాశాలను ఎంచుకోవడానికి వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. కళాశాల ఆవరణలోనే ప్రొఫెసర్లకు క్వార్టర్లతోపాటు విద్యార్థులకు వేర్వేరుగా ప్రత్యేక హాస్టల్ భవనాలు నిర్మిస్తున్నారు.