Three Sisters Clear NEET In A First Attempt : ముగ్గురు అక్కచెల్లెళ్లు.. తొలి ప్రయత్నంలోనే నీట్ ర్యాంక్ కొట్టారిలా.. కానీ..
వీరే.. టుబ బషీర్ , రుట్బా బషీర్, అర్బిష్ సిస్టర్స్. ఈ నేపథ్యంలో ఈ Three Sisters సక్సెస్ జర్నీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
టుబ బషీర్, రుట్బా బషీర్ , అర్బిష్ వీళ్లు కజిన్ సిస్టర్స్. వీరు శ్రీనగర్ సమీపంలోని నౌషీరా ప్రాంతానికి చెందినవారు. ఈ సిస్టర్స్ మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారు.
ఎడ్యుకేషన్ :
ఈ Three Sisters శ్రీనగర్‌లోని ఇస్లామియా హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదివారు. కశ్మీరు లోయలో తిరుగుబాట్లు, ఉగ్రవాదం వల్ల విపరీతమైన సమస్యలు ఎదురైనప్పటికీ వీరు మొక్కవోని దీక్షతో చదివి అనుకున్నది సాధించారు. ఈ విజయంలో పూర్తిగా తల్లిదండ్రుల సహకారం, సరైన శిక్షణ వల్లే విజయం సాధించామంటున్నారు.
తొలి ప్రయత్నంలోనే.. కానీ
ఆత్మవిశ్వాసంతో సాధించలేనిది ఏదీ లేదని జమ్మూ & కశ్మీరులోని ఈ Three Sisters నిరూపించారు. వీరు తొలి ప్రయత్నంలోనే నీట్‌లో విజయం సాధించి రికార్టు సృష్టించారు. ఇప్పుడు వీరు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
మా లక్ష్యం ఇదే..
తాము ముగ్గురం నీట్ పరీక్షలో విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని టుబ బషీర్ తెలిపారు. తాము కలిసికట్టుగా పాఠశాలకు, కోచింగ్ సెంటర్‌కు వెళ్లేవారమని తెలిపారు. ఎంబీబీఎస్ చదివి డాక్టర్లు కావడమే మాలక్ష్యం అన్నారు. చాలా శ్రమపడి ఈ ఫలితం సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు.
మా విజయానికి కారణం వీరే..
తమ తల్లిదండ్రులు తమను చిన్నప్పటి నుంచి ఉన్నత చదువు వైపు మమ్మళ్లి బాగా ప్రోత్సహించారని రుట్బా బషీర్ తెలిపారు. 11వ తరగతి నుంచే తాము నీట్ ప్రిపరేషన్ కొనసాగించామన్నారు. ఈ విజయం సాధించడానికి ప్రదాన కారణం మా తల్లిదండ్రులేనని తెలిపారు.
ఇదే మొదటి, చివరి ప్రయత్నంగా భావించి..
మా కుటుంబంలో ఇప్పటి వరకు ఎవరు వైద్యులు లేరన్నారు. అందుకే తాను వైద్యురాలిని కావాలని గట్టిగా నిర్ణయించుకున్నామని అర్బిష్ చెప్పారు. ఇదే మొదటి, చివరి ప్రయత్నమని భావించి తాను నీట్ పరీక్ష కోసం సిద్ధమయ్యానని చెప్పారు.