Supreme Court: మెడికల్ పీజీ సీట్ల విజ్ఞప్తులపై చర్యలు తీసుకోండి
దేశవ్యాప్తంగా ఏటా మెడికల్ పీజీ సీట్లు వేలాదిగా మిగిలిపోతున్న క్రమంలో కౌన్సెలింగ్‌కు అందరినీ అనుమతించాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను మార్చి 4న జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. విద్యార్థుల తరఫున న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, రమేశ్ అల్లంకిలు వాదనలు వినిపించారు. 2017 నుంచి మెడికల్ పీజీ సీట్లు వందశాతం భర్తీ కావడంలేదన్నారు. 2021లో ఒక్క తెలంగాణలోనే 172 సీట్లు మిగిలిపోయాయని, ఇలా దేశవ్యాప్తంగా సుమారు 10 వేల డెంటల్ పీజీ సీట్లు మిగిలిపోయాయని తెలిపారు. ఇప్పటికే ఈ విషయమై విద్యార్థులు, పలు మెడికల్ అసోసియేషన్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినట్లు తెలిపారు. అనంతరం ధర్మాసనం పదిరోజులకు విచారణ వాయిదా వేస్తూ ఈలోగా కేంద్రం ఆయా విజ్ఞప్తులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
చదవండి:
Civil Assistant Surgeon: తుది మెరిట్ జాబితా విడుదల.. అభ్యంతరాలు సీకరణకు చివరి తేదీ ఇదే..
Gandham Chandrudu: ప్రతి విద్యార్థి చదువుకు ప్రభుత్వ సహకారం