Skip to main content

JEE Advanced: వారు జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు రిజిస్టర్‌ చేసుకోవచ్చు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఐఐటీల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు వీలు కల్పించే జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌(జేఈఈ)–అడ్వాన్స్‌డ్‌ పరీక్షను అభ్యర్థులు కేవలం రెండుసార్లు రాసుకొనేలా జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు(జేఏబీ) తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకొనేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
They can register for JEE Advanced

జేఈఈ– అడ్వాన్స్‌డ్‌ ప్రయత్నాల సంఖ్యను మూడు నుంచి హఠాత్తుగా రెండుకు తగ్గించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జి మాసిహ్‌తో కూడిన ధర్మాసనం జ‌న‌వ‌రి 10న‌ విచారణ చేపట్టింది.

చదవండి: జేఈఈ (మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌) - గైడెన్స్ | వీడియోస్

2024 నవంబర్‌ 5 నుంచి 18వ తేదీ వరకు తమ కోర్సుల నుంచి డ్రాప్‌ అయిన అభ్యర్థులు జేఈఈ–అడ్వాన్స్‌డ్‌–2025 పరీక్ష రాసేందుకు రిజిస్టర్‌ చేసుకోవచ్చని స్పష్టంచేసింది. ఈ మేరకు ధర్మాసనం ఉత్తర్వు జారీ చేసింది. ప్రయత్నాల సంఖ్యను మూడు నుంచి రెండుకు తగ్గించడం వల్ల తాము నష్టపోతామని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 11 Jan 2025 04:21PM

Photo Stories