NTRUHS: ఎంబీబీఎస్ ప్రవేశాల ఆప్షన్లకు నోటిఫికేషన్.. చివరి తేదీ ఇదే..
తుది అర్హుల జాబితాలో 12,901 మంది విద్యార్థులున్నారు. ఆప్షన్ల నమోదుకు గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 3 నుంచి 6వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ తెలిపారు. మిర్చి 7, 8 తేదీల్లో సీట్ల కేటాయింపు చేపడతామన్నారు. ఒకేసారి అన్ని కళాశాలలకు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 5,060 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 5,060 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో (ఈడబ్ల్యూఎస్ అదనపు సీట్లు కలిపి) 2,185 సీట్లు, ఆల్ ఇండియా కోటా 325 సీట్లు పో ను రాష్ట్ర కోటాలో 1,860 సీట్లు భర్తీచేస్తారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో 175 సీట్లున్నాయి. ఇందులో ఆల్ ఇండియా కోటా లో 26 సీట్లు పోను ఎన్నారైలకు 23 సీట్లు కేటాయిం చారు. మిగిలిన 126 సీట్లు రాష్ట్ర కోటాలోకి వస్తాయి. 17 ప్రైవేటు వైద్య కళాశాలల్లో 2,700 సీట్లున్నాయి. వీటిలో ఏ కేటగిరీలో 1,350 సీట్లు, బీ కేటగిరీలో 938 సీట్లు, సీ కేటగిరీలో 412 సీట్లు భర్తీచేస్తారు.
చదవండి:
Andhra Pradesh: త్వరలోనే 9000 పోస్టుల భర్తీకి చర్యలు..
Medical Colleges: రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరత..