Skip to main content

NEET 2021: బీహెచ్ఎంఎస్ సీట్లకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..

అలిండియా కోటా బీహెచ్‌ఎంఎస్‌ సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 15న నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
Applications for all india Kota BHMS seats
బీహెచ్‌ఎంఎస్‌ సీట్లకు దరఖాస్తులు..

రాష్ట్రంలోని ప్రైవేట్‌ హోమియోపతి కళాశాలల్లోని అలిండియా కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తారు. ఫిబ్రవరి 16న ఉదయం 8 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తుతో పాటు కళాశాలల వారీగా వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా నీట్‌ –2021 అర్హత సాధించిన అభ్యర్థులు ఈ ఆలిండియా కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ www.knruhs.telangana.gov.inను చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో సూచించాయి. 

చదవండి: 

Supreme Court: నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌కు అనుమతి

NEET Admissions: జనవరి 6 తర్వాతే ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాలు

Department of Medical and Health: పీజీ ఇన్ సర్వీస్‌ కోటా పునరుద్ధరణ

Published date : 16 Feb 2022 01:38PM

Photo Stories