Supreme Court: నీట్ పీజీ కౌన్సెలింగ్‌కు అనుమతి
27% ఓబీసీ రిజర్వేషన్లు, ఆల్ ఇండియా కోటా సీట్లలో 10 శాతం ఈడబ్ల్యూఎస్(ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) రిజర్వేషన్లు సహా జూలై 29, 2021నాటి నోటిఫికేషన్ లో పేర్కొన్న రిజర్వేషన్లు అమలు చేస్తూ నీట్–పీజీ 2021 కౌన్సెలింగ్‌ను సత్వరమే చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ మేరకు జనవరి 7న జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈడబ్ల్యూఎస్ లబి్ధదారుల్ని గుర్తించడానికి రూ.8 లక్షల ఆదాయ పరిమితి విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమరి్థస్తూ పూర్తి వివరాలతో త్వరలోనే మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు తెలిపింది. ఈ అంశంపై మార్చి మూడో వారంలో విచారణ చేపడతామని వెల్లడించింది. ప్రవేశాలన్నీ తుది తీర్పునకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. ప్రవేశాల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం రాకుండా ఉండడానికి పాండే కమిటీ సిఫార్సులను అంగీకరిస్తున్నట్లు తెలిపింది. 2019 ఆఫీస్ మెమోరాండం ద్వారా నోటిఫై చేసిన ఈడబ్ల్యూఎస్ నిర్ధారణకు సంబంధించిన ప్రమాణాలన్నీ నీట్–పీజీ 2021, నీట్ యూజీ –2021లకు హాజరైన అభ్యర్థుల్లో ఈడబ్ల్యూఎస్ అర్హులను గుర్తించడానికి ఉపకరిస్తాయని పేర్కొంది. అయితే, ఈడబ్ల్యూఎస్ లబి్ధదారుల గుర్తింపునకు పాండే కమిటీ నిర్ణయించిన ప్రమాణాల చెల్లుబాటు మాత్రం తుది తీర్పునకు లోబడి ఉంటుందంది. పాండే కమిటీ సిఫార్సు చేసిన ఈడబ్ల్యూఎస్ ప్రమాణాల చెల్లుబాటుపై తుది విచారణ మార్చి చివరి వారంలో చేపడతామని తెలిపింది. అంతకుముందు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఓబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమనే పిటిషనర్ల వాదన సమర్థనీయం కాదన్నారు. నీట్–పీజీ పరీక్ష నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం నిబంధనలు మార్చడం కాదని స్పష్టం చేశారు. కేంద్రం ఎలాంటి అధ్యయనం చేయకుండానే ఈడబ్ల్యూఎస్ కోటాకు రూ.8 లక్షల ఆదాయ పరిమితిని నిర్ణయించిందంటూ కొందరు పిటిషన్లు వేయడం తెల్సిందే.
చదవండి:
NEET: నీట్‌లో గురుకుల విద్యార్థుల ప్రభంజనం
NEET Cut Off Marks 2021 : నీట్ టాప్ ర్యాంకర్ మనోడే...ఈసారి తగ్గిన కటాఫ్ మార్కులు..