Skip to main content

NEET Admissions: జనవరి 6 తర్వాతే ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాలు

Admissions for MBBS and BDS after January 6
Admissions for MBBS and BDS after January 6
  • ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.శంకర్‌

పీజీ మెడిసిన్, ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ జనవరి 6 తర్వాత ఉంటుందని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.శంకర్‌ మంగళవారం తెలిపారు. ఎకనమికల్లీ వీకర్స్‌ సెక్షన్‌ (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో కేసు ఉందన్నారు. దీనిపై జనవరి 6న కోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా యూజీ, పీజీ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహిస్తామన్నారు. ఆ సమయంలో కరోనా కేసులు పెరిగినా ఆన్‌లైన్‌లో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తాం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.


Click here for more Education News
 

 

Published date : 15 Dec 2021 03:13PM

Photo Stories