నిత్య విద్యార్థిగా ఉంటేనే..విజయం సాధ్యం
Sakshi Education
‘‘ఎప్పటికప్పుడు సరికొత్త నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. లేకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందనేది ఇప్పుడు సర్వసాధారణం. అయితే ఉద్యోగం కోల్పోతామనే ఆలోచనలను పక్కనపెట్టి, కొత్త నైపుణ్యాలను పెంపొందించుకుంటే కెరీర్ పరంగా ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చనే విషయాన్ని గుర్తించాలి.
ఆ దిశగా ఆశావహ దృక్పథం పెంపొందించుకొని యువత, ఉద్యోగులు ముందడుగు వేయాలి’’ అని సూచిస్తున్నారు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్. ప్రస్తుతం ఐటీ రంగంలో ఒకవైపు కొత్త నైపుణ్యాలతో ఉద్యోగాలు.. మరోవైపు స్కిల్స్ లేమితో కొలువుల్లో కోతల పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఆయనతో గెస్ట్‌కాలమ్...
ఐటీ రంగం ఆవిర్భావం నుంచి అందులో నిరంతరం ఏదో ఒక కొత్త టెక్నాలజీ ప్రవేశిస్తోంది. వీటిపై ఉద్యోగులు, ఉద్యోగార్థులు ఎప్పటికప్పుడు దృష్టిపెట్టి నేర్చుకోవాల్సిన ఆవశ్యకతానెలకొంటూనే ఉంది. ఉదాహరణకు ఆరేడేళ్ల కిందట క్లౌడ్ కంప్యూటింగ్ అనే కొత్త టెక్నాలజీ వచ్చింది. దీంతో చాలా మంది కెరీర్ పరంగా ఆందోళన చెందారు. కానీ, తర్వాత కాలంలో క్లౌడ్ టెక్నాలజీ రోజూవారీ విధుల్లో భాగమైంది. దీంతో ఐటీ రంగంలోనే కొనసాగాలనుకునే ఉద్యోగార్థులు, ఔత్సాహికులు ఈ కొత్త టెక్నాలజీని నేర్చుకొని తమ నైపుణ్యాలు మెరుగుపరచుకున్నారు.
ఆటోమేషన్, రోబోటిక్స్ సమస్య భిన్నమైందే:
క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ వంటి టెక్నాలజీలతో పోల్చితే ప్రస్తుతం నెలకొన్న ఆటోమేషన్, రోబోటిక్స్ సమస్య కొంత భిన్నమైందే. కారణం.. ఇందులో మానవ వనరులకు బదులు నైపుణ్యం ఉన్న యంత్రాల నుంచి పోటీ ఎదురుకావడం. అయితే వీటికి సంబంధించిన నైపుణ్యాలనూ ఎప్పటికప్పుడు నేర్చుకోవడం వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే ఆందోళన నుంచి బయటపడొచ్చు. ఉద్యోగార్థులు సైతం ఈ దిశగా కృషి చేయాలి. అలా ప్రయత్నించని వారే ఆటోమేషన్, రోబోటిక్స్ సమస్య ప్రభావానికి గురవుతున్నారు. వీరిని చూసి మిగతా వారు ఆందోళన చెందడం, ఐటీ రంగంలో ఇక మనుగడ ఉండదనుకోవడం సరికాదు.
ఆ నివేదికలు నిజమే..
ఈ ఏడాది ఆటోమేషన్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. ఈ మూడు విభాగాల్లోనే దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు లభించనున్నాయనే ఫిక్కీ, ఇతర స్టాఫింగ్ సంస్థల సర్వే నివేదికలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే విధంగానే ఉన్నాయి. వీటిని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత ఔత్సాహికులదే.
నాస్‌కామ్ తోడుగా..
ఉద్యోగార్థులు, యువతకు నైపుణ్యాల పరంగా నాస్కామ్ ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఈ దిశగా ఇప్పటికే సెక్టార్ స్కిల్ కౌన్సెల్స్ ఏర్పాటు చేశాం. అలాగే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, 3-డీటెక్నాలజీస్ తదితర అంశాల్లో శిక్షణకు బెంగళూరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ సెంటర్ నెలకొల్పాం. మరో మూడు కేంద్రాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం.
అకడమిక్స్‌లోనూ భాగం చేయాలి..
కొత్త నైపుణ్యాలు నిరంతరం ఆవిష్కృతమవుతున్న నేపథ్యంలో వాటిని అకడమిక్స్‌లోనూ చేర్చేలా చర్యలు తీసుకోవాలి. కనీసం మూడేళ్లకోసారైనా సిలబస్‌లో మార్పులు చేసేందుకు ప్రయత్నించాలి. ఇండస్ట్రీ నిపుణులను భాగస్వాములను చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
నిత్య విద్యార్థి.. అదే విజయమంత్రం
విద్యార్థులకు, ఉద్యోగార్థులకు ఇచ్చే సలహా ఏమంటే.. ఎప్పుడూ నిత్య విద్యార్థిగా ఉండాలి. అప్పుడే ఏ రంగంలోనైనా విజయం సాధించగలరు. పాత పద్ధతుల్లోనే కొనసాగుదాం అనే ధోరణి వదిలి.. ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీల వైపు అడుగులు వేయాలి. అదే విజయ మంత్రం!!

Published date : 30 Jan 2018 12:09PM