Skip to main content

ఫిజిక్స్ అర్థం కాదనేది అపోహే..: శాంతిస్వరూప్ భట్నాగర్-2020విజేత సురాజిత్ ధారా

ఫిజిక్స్ అంటే ఓ పట్టాన అర్థంకాని ఈక్వేషన్ల సమాహారం.. చాలామంది విద్యార్థుల్లో ఉండే అభిప్రాయం ఇది! అది అపోహమాత్రమేనని.. ఒక్కసారి ఈ సబ్జెక్టును ప్రేమతో చదివితే.. అద్భుతాలను ప్రపంచానికి పరిచయం చేయవచ్చంటున్నారు.. ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ 2020 విజేత, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్), స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ సురాజిత్ ధారా.
పశ్చిమ బెంగాల్‌లోని మారుమూల పల్లె నుంచి వచ్చిన ఆయన.. ఓవైపు ప్రొఫెసర్‌గా విద్యార్థులను తీర్చిదిద్దుతునే.. మరోవైపు తనకు ఇష్టమైన ప్రయోగాలు చేసి అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఫిజిక్స్‌లో చేసిన ప్రయోగాలకు కేంద్ర ప్రభుత్వం ప్రొఫెసర్ సురాజిత్ ధారాను ‘శాంతిస్వరూప్ భట్నాగర్-2020’ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ సురాజిత్‌తో ఈ వారం గెస్ట్‌కాలం..

టీచర్ అవ్వాలని ఇష్టంతో చదివాను..
విద్యార్థులు తాము చూసిన సమాజం నుంచి తమకు నచ్చిన అంశాలను ఎంచుకుంటారు. కెరీర్‌ను కూడా అందుకు అనుగుణంగానే మలచుకుంటారు. డాక్టర్, ఇంజనీర్, పోలీస్ ఆఫీసర్ వంటి కెరీర్‌లు అలాగే నిర్ణరుుంచుకుంటారు. నేను పుట్టింది, చదువుకుంటూ పెరిగింది.. పశ్చిమ బెంగాల్‌లోని కిస్నోబాటి గ్రామంలో! స్థానిక పాఠశాలలో చదువుకున్నాను. బెంగాల్‌లో ఉపాధ్యాయులకు ఇచ్చే గౌరవం మరెవరికీ ఉండదు. మా నాన్న పెద్దగా చదువుకోలేదు. చిరు వ్యాపారం నడుపుతూ వ్యవసాయం కూడా చేసేవారు. మా దూరపు బంధువు ఒకరు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. ఆయన్ను చూస్తూ పెరిగాను. ఆయన సూచనలు పాటిస్తూ ఫిజిక్స్‌పై ఇష్టం పెంచుకున్నాను. అలా ఫిజిక్స్ సబ్జెక్టు నా జీవితంలో భాగమైపోరుుంది. బుర్ద్‌వాన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, ఎంఎస్సీ(ఫిజిక్స్) పూర్తి చేశాను.

ఆర్‌ఆర్‌ఐ జీవితాన్నే మార్చేసింది..
ఉపాధ్యాయుడిగా చేరాలని భావిస్తున్న సమయంలో శ్రేయోభిలాషుల సలహా మేరకు ‘రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’(ఆర్‌ఆర్‌ఐ-బెంగళూరు)లో పీహెచ్‌డీ చేసేందుకు దరఖాస్తు చేశాను. అక్కడ సీటు రావడంతో నా జీవితమే మారిపోరుుంది. పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు స్థానికంగా చదువుకున్న నేను.. తొలిసారి బెంగాల్ వదిలి బెంగళూరు వచ్చాను. 1998-2003 మధ్య మా గురువు ప్రొఫెసర్ ఎన్.వి. మధుసూదన్ ఆధ్వర్యంలో ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేశాను. ప్రస్తుతం నాకు ప్రభుత్వం 2020 సంవత్సరానికి ఫిజిక్స్‌లో ‘శాంతి శ్వరూప్ భట్నాగర్’ అవార్డు ప్రకటించింది. ఇదే అవార్డును మా గురువు ఎన్.వి.మధుసూదన్, ఆయన గురువుకు కూడా ఇదే అవార్డు వరించింది. ఒకే ఇన్‌స్టిట్యూట్ నుంచి ఒకే విభాగానికి చెందిన ముగ్గురం ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది.

బిట్స్ పిలానీ టు యూఓహెచ్..

ఆర్‌ఆర్‌ఐలో పీహెచ్‌డీ పూర్తికాగానే.. 2004లో బిట్స్ పిలానీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. మూడేళ్లు అక్కడే పనిచేశాక.. 2006లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాను. ఇక్కడ పనిచేస్తూనే ఫిజిక్స్‌లో మరింత విజ్ఞానం సంపాదించేందుకు జపాన్‌లోని టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ‘ఆర్గానిక్ అండ్ పాలిమరిక్ మెటీరియల్స్’పై పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ చేశాను. తిరిగి వచ్చాక యూఓహెచ్‌లోనే ప్రయోగాలు ప్రారంభించాను.

‘లిక్విడ్ క్రిస్టల్’కు అవార్డు..
మనం నిత్యం వినియోగించే స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టెలివిజన్, కంప్యూటర్ వంటి పరికరాల స్క్రీన్స్‌ను ‘లిక్విడ్ క్రిస్టల్స్(ఎల్‌సిడీ)తో రూపొందిస్తారు. ఈ టెక్నాలజీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం దేశీయంగా లేకపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. నేను దీనిపై ప్రయోగాలు చేసి చాలా చౌకై న, నాణ్యమైన ఎల్‌సీడీ రూపకల్పనకు నాంది పలికాను. ఇందుతో తొలిసారి దేశీయంగా ‘బెంచ్ టాప్ రబ్బింగ్ మిషీన్’ను సైతం ప్రపంచంలోనే చౌకగా తయారు చేసి వినియోగంలోకి తెచ్చాను. ఈ ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం ఫిజిక్స్‌లో ‘శాంతి స్వరూప్ భట్నాగర్-2020’ అవార్డు ప్రకటించింది.

అద్భుతమైన మేధా సంపత్తి మనది..
మనదేశ యువతలో అద్భుతమైన మేధా సంపత్తి ఉంది. అరుుతే, దానికి సరైన మార్గనిర్దేశం అవసరం. చదువులు అంటే ఇంజనీరింగ్, మెడిసిన్ వంటివే కాదు.. సైన్‌‌సతో అద్భుతాలు చేయవచ్చు. పేరు ప్రఖ్యాతులతో పాటు, దేశానికి, ప్రపంచానికి అవసరమైన ఆవిష్కరణలు అందిచొచ్చు. విద్యార్థులు సైన్‌‌స కోర్సులు అంటే భయపడుతుంటారు. కాని ఇష్టపడి చదివితే ఫిజిక్సే కాదు.. ఏ సైన్‌‌స సబ్జెక్టు అరుునా తేలిగ్గా అర్థమవుతుంది. అందుకు మారుమూల గ్రామం నుంచి వచ్చిన నేనే ఉదాహరణ. నా వద్ద రీసెచ్చ్ చేసిన ఎనిమిది మంది విద్యార్థుల్లో ఏడుగురు ప్రపంచ ప్రసిద్ధ యూనివర్సిటీల్లో పోస్ట్ డాక్టోరల్‌కు ఎంపికయ్యారు. వారు చేస్తున్న ప్రయోగాలు ప్రపంచానికి ఎంతో మేలు చేస్తారుు.
Published date : 12 Oct 2020 01:46PM

Photo Stories