చదివే తీరు మారాలి...
Sakshi Education
‘విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలి. దీనికోసం రెగ్యులర్ లెర్నింగ్ అలవాటు చేసుకోవాలి. అంతకంటే ముందు విద్యార్థులు చదివే తీరులో మార్పు రావాలి.
అప్పుడే సత్ఫలితాలు వస్తాయి’ అంటున్నారు.. ఐఐటీ-జోధ్‌పూర్ డెరైక్టర్ ప్రొఫెసర్ సి.వి.ఆర్.మూర్తి. సివిల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తిచేసి, ప్రకృతి విపత్తుల నిర్వహణపై పరిశోధనల ద్వారా జాతీయ స్థాయి గుర్తింపు పొందిన సి.వి.ఆర్.మూర్తితో ‘గెస్ట్ కాలమ్’..
నేటి తరం విద్యార్థులు.. ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి వారు.. సబ్జెక్టు అంశాల అధ్యయనంలో విభిన్నంగా వ్యవహరించాలి. కేవలం తరగతులు, ల్యాబ్స్‌కు పరిమితం కావడం సరికాదు. ఒక అంశానికి సంబంధించిన సమస్యలకు తామే సొంతంగా పరిష్కారం కనుగొనేలా విశ్లేషణాత్మక దృక్పథంతో అడుగులు వేయాలి. అప్పుడే అకడమిక్‌గా రాణించడం సాధ్యమవుతుంది.
లక్ష్యం మరవొద్దు..
ఐఐటీల్లో చేరాలనే పట్టుదలతో చదివి, ఆ అవకాశం దక్కించుకున్న విద్యార్థులు.. క్యాంపస్‌లో అడుగుపెట్టగానే తమ లక్ష్యం నెరవేరిందని భావించకూడదు. తాము కోర్సులో ఎందుకు చేరాం? భవిష్యత్తు లక్ష్యం ఏంటి? ఐఐటీ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? తదితర ప్రశ్నలతో స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. ఆపై లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని, వాటిని చేరేందుకు కృషిచేయాలి. అలాకాకుండా ఐఐటీలో సీటు లభించడంతోనే అంతా సాధించినట్లు భావించి విశ్రాంతి తీసుకునే ధోరణిని అనుసరిస్తే అకడమిక్‌గా ముందుకు సాగడం కష్టం.
ఆ పేరు పోకూడదు :
ఐఐటీ క్యాంపస్‌లంటే ఇంజనీరింగ్ విద్యకు పెట్టింది పేరు. ఈ గుర్తింపును కొనసాగించేలా వీటిలో బోధన-అభ్యసనంకోణంలో కొన్ని కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. వీటిని విమర్శించడం సరికాదు. అవి తమ భవిష్యత్తుకు ఉపయోగపడే సాధనాలని విద్యార్థులు భావించాలి. కఠిన విధానాలు అనుసరిస్తున్నప్పటికీ.. విద్యార్థుల్లో ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కూ ఐఐటీలు సమయం కేటాయిస్తున్నాయి. తద్వారా విద్యార్థులకు చదువుల ఒత్తిడి తగ్గేలా చర్యలు తీసుకుంటున్నాయి.
తల్లిదండ్రుల పర్యవేక్షణ..
ఐఐటీలో సీటు వచ్చే వరకు పిల్లలకంటే ఎక్కువ తాపత్రయపడే తల్లిదండ్రులు.. సీటు లభించగానేతమ బాధ్యత తీరిందనుకుంటారు. అలా కాకుండా పిల్లలు ఐఐటీల్లో చేరాక నిరంతర పర్యవేక్షణ అవసరమని గుర్తించాలి.
సెల్ఫ్ లెర్నింగ్ :
విద్యార్థులు సెల్ఫ్ లెర్నింగ్ దృక్పథంఅలవర్చుకోవాలి. తరగతి గదిలో చెప్పిన నిర్దిష్ట అంశంలోవిస్తృత నైపుణ్యం పొందేలా సొంతంగా అభ్యసనం చేయాలి. దీనికోసం ఎన్నో వనరులు అందుబాటులో ఉన్నాయి. లైబ్రరీల్లో వేలాది పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. అలాగే జర్నల్స్, కొత్త పబ్లికేషన్స్ సైతం లభిస్తాయి. వీటిని చదవడం ద్వారా సంబంధిత అంశంపై అప్లికేషన్ దృక్పథం అలవడుతుంది.
ఒత్తిడి సహజం :
ఐఐటీల్లో చేరిన తొలిరోజుల్లో విద్యార్థులు ఒత్తిడికి గురికావడం సహజం. కారణం.. ఇంటర్మీడియెట్ వరకు చదివిన విధానంతో పోల్చితే ఐఐటీల్లో పూర్తి భిన్నంగా ఉండటం. అలాగే వేర్వేరు ప్రాంతాల విద్యార్థులతో కలసిపోవడంలోనూ కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ ఒత్తిడి కొన్ని రోజుల్లోనే సమసిపోతుంది. ఒత్తిడికి గురయ్యే విద్యార్థుల కోసం ఇప్పుడు అన్ని ఐఐటీల్లోనూ కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇవి మంచి ఫలితాలు ఇస్తున్నాయి.
ఒకే ఎంట్రన్స్‌తో ప్రయోజనం :
జాతీయస్థాయిలో ఇంజనీరింగ్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు ప్రతిపాదిస్తున్న సింగిల్ ఎంట్రన్స్ టెస్ట్ విధానం విద్యార్థులకు మేలు చేసేదే. అయితే వీటిని నిర్వహించే క్రమంలో అన్ని రాష్ట్రాల సిలబస్‌లనూ పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే రాష్ట్రాల స్థాయిలోని బోర్డులు సైతం తమ సిలబస్‌లో మార్పులు చేయాలి.
విద్యార్థినుల సంఖ్యలో పెరుగుదల :
ఉన్నతవిద్యలో ముఖ్యంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో విద్యార్థినుల ప్రవేశాలను ప్రోత్సహించేలా ఇటీవల ప్రభుత్వం తీసుకున్న అదనపు సీట్ల కేటాయింపు నిర్ణయం తప్పనిసరిగా మంచి ఫలితాలు ఇస్తుంది. ఐఐటీల్లో కచ్చితంగా విద్యార్థినుల సంఖ్య పెరుగుతుంది. ఈ విషయంలో తల్లిదండ్రుల ఆలోచన దృక్పథంలోనూ మార్పు రావాలి. ఆడపిల్లలు.. ఇంజనీరింగ్ చదవలేరనో లేదా సుదూర ప్రాంతాలకు పంపడం మంచిది కాదనో అభిప్రాయం వీడాలి.
విద్యార్థులకు సలహా :
త్వరలో ఐఐటీల్లో చేరబోయే విద్యార్థులు.. క్యాంపస్‌లో అడుగుపెట్టే సమయానికి మూడు లక్షణాలు అలవర్చుకోవాలి. అవి.. ఇంగ్లిష్ కమ్యూనికేషన్, ఇంటర్- పర్సనల్ స్కిల్స్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్. ఈ మూడు లక్షణాలూ సొంతం చేసుకుని ఐఐటీల్లో అడుగుపెడితే నాలుగేళ్ల కోర్సులో మొదటి నుంచే ఎలాంటి ఇబ్బందీ లేకుండా సాఫీగా ముందుకు సాగిపోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు బీటెక్ పూర్తయిన తర్వాత రీసెర్చ్ వైపు అడుగులు వేయడం మంచిదని నా అభిప్రాయం. ఆర్థిక, సామాజిక కారణాలతో క్యాంపస్ కొలువులు కోరుకునే వారు.. ఉద్యోగంలో చేరినా.. ఉన్నతవిద్యను అభ్యసించడంపై దృష్టిసారించాలి. ముఖ్యంగా తాము పనిచేస్తున్న రంగంలో తాజా నైపుణ్యాలు పొందేలా నిరంతర అధ్యయనం కొనసాగించాలి.

Published date : 09 Apr 2018 06:34PM