Skip to main content

AIIMS Recruitment 2024: ఎయిమ్స్‌లో-నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..

ఎయిమ్స్‌ న్యూఢిల్లీ.. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ సంస్థల్లో నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నర్సింగ్‌ ఆఫీసర్‌ రిక్రూట్‌మెంట్‌ కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నార్‌సెట్‌)-6 నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
AIIMS New Delhi    AIIMS Recruitment 2024 For Nursing Officer Jobs    NORSET-6 notification for Nursing Officer Recruitment

ఎయిమ్స్‌ సంస్థలు: ఎయిమ్స్‌ భటిండా, ఎయిమ్స్‌ భువనేశ్వర్, ఎయిమ్స్‌ బిలాస్‌పూర్, ఎయిమ్స్‌ డియోఘర్, ఎయిమ్స్‌ గోరఖ్‌పూర్, ఎయిమ్స్‌ గువాహటి, ఎయిమ్స్‌ కళ్యాణి, ఎయిమ్స్‌ మంగళగిరి, ఎయిమ్స్‌ నాగ్‌పూర్, ఎయిమ్స్‌ రాయ్‌ బరేలీ, ఎయిమ్స్‌ న్యూఢిల్లీ, ఎయిమ్స్‌ పాట్నా, ఎయిమ్స్‌ రాయ్‌పూర్, ఎయిమ్స్‌ విజయ్‌పూర్‌.
అర్హత: గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌ లేదా యూనివర్శిటీ నుంచి బీఎస్సీ(హానర్స్‌) నర్సింగ్‌/ బీఎస్సీ నర్సింగ్‌ లేదా బీఎస్సీ(పోస్ట్‌ సర్టిఫికేట్‌)/బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ తదితర ఉత్తీర్ణత ఉండాలి. స్టేట్‌/ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ లేదా రాష్ట్రంలో  నర్సులు, మిడ్‌వైఫ్‌లుగా రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
వేతనం: రూ.9300 నుంచి రూ.34,800+ గ్రేడ్‌ పే రూ.4600.

పరీక్ష విధానం: నార్‌సెట్‌ పరీక్ష రెండు దశలలో జరుగుతుంది. అవి..ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ పరీక్ష. వీటి ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా .

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.03.2024.

వెబ్‌సైట్‌: https://www.aiimsexams.ac.in/

చదవండి: Andhra Pradesh Jobs 2024: ఫిజియోథెరపీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 07 Mar 2024 12:46PM

Photo Stories