Skip to main content

KVPY 2021: ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైతే డిగ్రీ నుంచి పీజీ వ‌ర‌కూ ఉప‌కార వేత‌నం

Kishore Vaigyanik Protsahan Yojana (KVPY) Scholarships for students
Kishore Vaigyanik Protsahan Yojana (KVPY) Scholarships for students
  • నవంబర్‌ 7వ తేదీన కేవీపీవై అప్టిట్యూడ్‌ టెస్ట్‌
  • ఆన్‌లైన్‌ పరీక్ష ఆధారంగానే ఫెలోషిప్‌కు ఎంపిక
  • ఎంపికైతే నెలకు రూ.5000–రూ.7000 వరకూ అందజేత

కేవీపీవై.. కిషోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజన. ఇది సైన్స్‌ పరిశోధనల దిశగా విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌. అప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు బ్యాచిలర్‌ డిగ్రీ నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ వరకూ.. ఉపకార వేతనాలను అందిస్తారు. ఈ ఏడాది కేవీపీవై 2021 పరీక్షను ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, బెంగళూరు నిర్వహిస్తోంది. నవంబర్‌ 7వ తేదీన ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష జరుగనుంది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్, సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులతోపాటు డిగ్రీ ప్రథమ సంవత్సరం వారు కూడా కేవీపీవై స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతల ఆధారంగా మూడు విభాగాల్లో రాత పరీక్ష ఉంటుంది. ఎస్‌ఏ, ఎస్‌ఎక్స్, ఎస్‌బీ అనే మూడు స్ట్రీమ్స్‌ ఉంటాయి. మూడు విభాగాల్లోనూ అర్హులైన  దరఖాస్తుదారులకు జాతీయస్థాయిలో అప్టిట్యూడ్‌ టెస్టు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు. ఎంపికైన విద్యార్థులకు భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫెలోషిప్‌లను అందిస్తుంది. 

చ‌ద‌వండి: NID DAT 2022: ఈ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌...

ఉపకార వేతనం
ఈ ఫెలోషిప్‌లకు ఎంపికైన విద్యార్థులకు మొదటి మూడేళ్లు అంటే డిగ్రీ స్థాయిలో నెలకు రూ.5 వేలు స్టయిపెండ్‌గా ఇస్తారు. దీనికి అదనంగా వార్షిక గ్రాంటు రూ.20వేలు ఇస్తారు. పీజీ స్థాయిలో ఎమ్మెస్సీ లేదా 4–5ఏళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ/ఎంఎస్‌/ఎంఎస్‌ మ్యాథ్స్‌/ఎంఎస్‌ స్టాట్‌ వారికి నెలకు రూ.7వేల చొప్పున స్టయిపెండ్‌ లభిస్తుంది. వీరికి వార్షిక గ్రాంటు రూ.28వేలు ఇస్తారు.

  • ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీచేస్తారు.æ దీనిద్వారా జాతీయస్థాయి ప్రయోగశాలలు, యూనివర్సిటీల లైబ్రరీలు, పరిశోధన ల్యాబ్స్‌లో సౌకర్యాలను వినియోగించుకోవచ్చు. 
  • కేవీపీవైకు ఎంపికైన వారికి వేసవి సెలవుల్లో ఐఐటీలు వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సమ్మర్‌ క్యాంపులు నిర్వహిస్తారు. అక్కడ సైన్స్‌పై నిపుణులతో ప్రత్యేక ఉపన్యాసాలు ఇప్పిస్తారు.  సైన్స్‌కు సంబంధించిన అనేక అంశాలను ప్రయోగశాలల్లో ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తారు. అలాగే ఆయా రంగాల్లో నిష్ణాతులైన శాస్త్రవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. వీటితోపాటు కెరీర్‌ అవకాశాలనూ వివరిస్తారు.

చ‌ద‌వండి: JOSAA 2021: ఐఐటీలు, నిట్‌లు, జీఎఫ్‌ఐటీల్లో ప్రవేశం పొందాలంటే.. ఇది తప్పనిసరి

ఎస్‌ఏ స్ట్రీమ్‌

  • ప్రస్తుత విద్యా సంవత్సరం అంటే 2021–22లో.. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెకులతో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం లేదా 11వ తరగతిలో చేరిన విద్యార్థులు ఈ విభాగంలోకి వస్తారు. బేసిక్‌ సైన్స్‌ డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు దీనికి అర్హులు. వీరు 10+2/ఇంటర్మీడియెట్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ విద్యార్థులు 50శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. 
  • ఎస్‌ఏ స్ట్రీమ్‌ పరీక్ష రెండు పార్ట్‌లుగా 80 ప్రశ్నలు–100 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్‌–ఎ నుంచి 60 ప్రశ్నలు, పార్ట్‌–బి నుంచి 20 ప్రశ్నలను అడుగుతారు. 
  • పార్ట్‌–ఎ: మ్యాథ్స్‌–15, ఫిజిక్స్‌–15, కెమిస్ట్రీ–15, బయాలజీల నుంచి 15 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 వంతు మార్కులను తగ్గిస్తారు. 
  • పార్ట్‌–బి: మ్యాథ్స్‌–5, ఫిజిక్స్‌–5, కెమిస్ట్రీ–5, బయాలజీ–5 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కులు లభిస్తాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.5 వంతు మార్కులను తగ్గిస్తారు. 

చ‌ద‌వండి: TIFR GS 2022: ఇందులో ప్రతిభ చూపిన వారికి.. ప్రతి నెల రూ.35 వేల ఆర్థిక ప్రోత్సాహం

స్ట్రీమ్‌ ఎస్‌ఎక్స్‌
మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌ సెకండ్‌ ఇయర్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ విభాగంలోకి వస్తారు. బేసిక్‌ సైన్స్‌లో డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు అర్హులు. వీరు 10+2/ఇంటర్మీడియెట్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ విద్యార్థులు 50శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.
 
స్ట్రీమ్‌ ఎస్‌బీ
మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో బీఎస్సీ/బీఎస్‌/బీస్టాట్‌/బీమ్యాథ్, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ/ఎంఎస్‌ల్లో ప్రవేశం పొందేవారు ఈ విభాగంలోకి వస్తారు. వీరు డిగ్రీ ప్రథమ సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి.
 
స్ట్రీమ్‌ ఎస్‌ఎస్‌/ఎస్‌బీ పరీక్ష విధానం

  • స్ట్రీమ్‌ స్ట్రీమ్‌ ఎస్‌ఎస్‌/ఎస్‌బీ పరీక్ష రెండు పార్ట్‌లుగా 160 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్‌–ఎ నుంచి 80 ప్రశ్నలు, పార్ట్‌–బి నుంచి 40 ప్రశ్నలను అడుగుతారు. విద్యార్థులు 80 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. 
  • పార్ట్‌–1లో మ్యాథ్స్‌–20, ఫిజిక్స్‌–20, కెమిస్ట్రీ–20, బయాలజీ–20 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 వంతు మార్కు తగ్గిస్తారు. 
  • పార్ట్‌–2: మ్యాథ్స్‌–10, ఫిజిక్స్‌–10, కెమిస్ట్రీ–10, బయాలజీ–10 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కులు లభిస్తాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.5 వంతు మార్కును తగ్గిస్తారు. 

చ‌ద‌వండి: Demanding‌ Job ‌Profiles‌: వీరికి రూ.8లక్షలు–రూ.20లక్షల వరకు వార్షిక వేతనం

ప్రిపరేషన్‌ ఇలా

  • ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని రివిజన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకోవాలి. వీలైనంత త్వరగా సిలబస్‌ పూర్తిచేసి.. అన్ని అంశాలను మరోసారి రివిజన్‌ చేసుకోవాలి.
  • రివిజన్‌ సమయంలో ఇప్పటికే ప్రిపేర్‌ చేసి పెట్టుకున్న షార్ట్‌నోట్స్‌ను చదవాలి. దీనివల్ల తక్కువ సమయంలో పునశ్చరణ పూర్తవుతుంది.
  • గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్‌ చేయడం మేలు చేస్తుంది. దీంతోపాటు వీలైనన్నీ ఎక్కువ మాక్‌ టెస్టులను రాయాలి.
  • ప్రిపరేషన్, రివిజన్‌ను ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలి. బలహీనంగా ఉన్న అంశాలపై తగినంత దృష్టిపెట్టాలి. 

పరీక్ష కేంద్రాలు
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కర్నూల్‌లల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. 

ముఖ్యమైన సమాచారం
కేవీపీవై అప్టిట్యూడ్‌ టెస్ట్‌: 07.11.2021
ఎస్‌ఏ: పరీక్ష సమయం: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు
ఎస్‌ఎక్స్‌/ఎస్‌బీ: సాయంత్రం 2 గంటల నుంచి 5 గంటల వరకు;

వెబ్‌సైట్‌: http://www.kvpy.iisc.ac.in

చ‌ద‌వండి: National Olympiads: ఇందులో ప్రతిభ చూపిన వారికి... స్కాలర్‌షిప్స్, ప్రవేశాల్లో ప్రాధాన్యం

Published date : 28 Oct 2021 05:57PM

Photo Stories