Skip to main content

Medical Posts Interview: వైద్యుల పోస్టుల‌కు ఇంట‌ర్వ్యూ తేదీ

విమ్స్ లో వైద్యుల పోస్టులు భ‌ర్తీ కోసం ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తున్న‌ట్లు విమ్స్ డైరెక్ట‌ర్ ప్ర‌క‌టించారు. ఆస‌క్తి గ‌ల వారు కింద తెలిపిన వివ‌రాలానుసారం, ఇంట‌ర్య్వూకు హాజ‌రు కావాల‌ని పేర్కొన్నారు. పోస్టుకు సంబంధించిన వివ‌రాల‌ను కూడా స్ప‌ష్టించారు.
Apply Now, Interviews for specialists post at VIMS on 21st,WIMS Post Details,Interview Schedule
Interviews for specialists post at VIMS on 21st

సాక్షి ఎడ్యుకేష‌న్: విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(విమ్స్‌)లో వైద్యులు పోస్టులకు ఈనెల 21న ఇంటర్వ్యూలు నిర్వహించన్నట్లు విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రాంబాబు శుక్రవారం తెలిపారు. 43 మంది సూపర్‌ స్పెషలిస్టులు, జనరల్‌ స్పెషలిస్టుల పోస్టులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. సూపర్‌ స్పెషలిస్టు వైద్యులకు నెలకు రూ 1.60లక్షలు, జనరల్‌ స్పెషలిస్టు వైద్యులకు రూ. 92 వేలు వేతనం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.

New Medical Colleges: 17 మెడికల్‌ కాలేజీలు... 4,735 ఎంబీబీఎస్‌ సీట్లు - సీఎం జగన్‌

ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 21న ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం 2 గంటలు వరకు జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు. ఏపీ మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారులు ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. మరిన్ని వివరాలు కోసం dme.ap.nic.in అనే వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించారు.

Published date : 16 Sep 2023 01:33PM

Photo Stories