Skip to main content

Job Mela at Degree College : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. డిగ్రీ క‌ళాశాల‌లో ఈనెల 17న జాబ్ మేళా..!

Job mela at degree college on 17th september  Job fair announcement at Sri Sathya Sai Degree College in Palakonda Job fair for youths with various educational qualifications and age group 18-30 Job fair organized by State Skill Development Organization

పార్వతీపురం: పాలకొండలోని శ్రీసత్యసాయి డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ నెల 17న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధికల్పనలో భాగంగా పది, ఇంటర్మీడియట్‌, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్‌, ఎంఎస్సీ విద్యార్హతలు కలిగి, 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు ఈ జాబ్‌మేళాలో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు.

Job Mela: యువతకు గుడ్‌న్యూస్‌.. రేపు జాబ్‌మేళా

ఈ మెగా జాబ్‌మేళాకు 16 కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారని, 1,050 పోస్టులు ఆయా కంపెనీల్లో భర్తీ చేయనున్నారని తెలిపారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు తమ వివరాలను skilluniverse.apssdc.in యూనివర్స్‌.ఏపీఎస్‌ఎస్‌డీసీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో విధిగా నమోదు చేసుకోవాలని చెప్పారు. ఆధార్‌ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్‌, జిరాక్స్‌, ఒక పాస్‌పోర్టు సైజ్‌ ఫోటోతో ఆ రోజున ఉదయం 9 గంటలకు జాబ్‌మేళాకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ 6301275511, 7993795796 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

National Forest Martyrs Day: సెప్టెంబర్ 11వ తేదీ జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం.. ఈ రోజుకు ఉన్న ప్రత్యేక కారణం ఇదే..

Published date : 12 Sep 2024 10:15AM

Photo Stories