Education Department: ఉపాధ్యాయ బదిలీల సీనియారిటీ జాబితా విడుదల
నల్లగొండ: ఉపాధ్యాయుల బదిలీలు, ఖాళీల తాత్కాలిక జాబితాను విద్యా శాఖ ఆదివారం ప్రకటించింది. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆదివారం జిల్లా విద్యా శాఖ జిల్లాలోని బదిలీలకు సంబంధించి 4,416 మంది దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయా ఉపాధ్యాయులకు ఎన్ని పాయింట్లు వచ్చాయనే జాబితాను తాజాగా ప్రకటించారు. అదేవిధంగా జిల్లాలో ప్రస్తుతం తప్పనిసరి బదిలీలు అవుతున్న స్థానాలతోపాటు జిల్లాలో ఎక్కడెక్కడ ఏయే సబ్జెక్టులకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయో సీనియారిటీ ప్రకారం జాబితాను విడుదల చేశారు. ఈ నెల 14న హెడ్‌మాస్టర్లకు బదిలీలు జరుగనున్నాయి. ఆ తరువాత స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించనున్నారు.
చదవండి: TRT Notification 2023: ఈ జిల్లాలో మొత్తం 823 పోస్టులు
సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
నల్లగొండ: విద్యాశాఖలో భాగమైన సమగ్ర శిక్షలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఘనపురం భీమయ్య డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు నల్లగొండలోని కలెక్టరేట్ ఎదుట చేసట్టిన రిలే నిరాహార దీక్ష ఆదివారం నాటికి ఏడవ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు ఎస్‌టీయూ నాయకులు సంఘీభావం తెలి పారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులకు మినీమం టైం స్కేల్ వెంటనే అమలు చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించి దీక్ష విరమింపజేయాలని కోరారు.