Skip to main content

Campus Recruitment : ఎస్ఎస్‌సీ, ఐటీఐ పాసైన అభ్య‌ర్థులకు క్యాంప‌స్ రిక్రూట్‌మెంట్‌.. తేదీ!

విద్యార్థుల‌కు నిర్వ‌హించే క్యాంప‌స్ రిక్రూట్మెంట్ గురించి వివ‌రించారు ప్ర‌భుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ర‌వీంద్ర‌బాబు..
Srisailam Government Industrial Training Institute  Recruitment event schedule  Srisailam Government Industrial Training Institute  Campus recruitment event on 26th of this month at 10 am  Campus Recruitment at Govt ITI college for Tenth and ITI Students

శ్రీశైలం: శ్రీశైలం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లో ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ పాసైన అభ్యర్థులకు ఈనెల 26వ తేదీ ఉదయం 10 గంటలకు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ ఏ.రవీంద్రబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రీన్‌టెక్‌ ఇండస్ట్రీస్‌, టీవీ ఫాస్టనర్స్‌ లిమిటెడ్‌, వికాస ఇండస్ట్రీస్‌, రాణే బ్రేక్‌ లైనర్స్‌ తదితర కంపెనీలు పాల్గొంటాయని ఆయన తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 24వ తేదీలోగా శ్రీశైలం ఐటీఐలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలన్నారు. ఇంటర్వ్యూకు బయోడేటా, పదవతరగతి మార్కుల మెమో, ఆధార్‌కార్డ్‌, బ్యాంక్‌ పాస్‌పుస్తకం, రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో హాజరు కావాలని రవీంద్రబాబు తెలిపారు.

SCCL Recruitment 2024: సింగరేణిలో 327 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల, పూర్తి వివరాలు ఇవే..

Published date : 22 Jun 2024 03:20PM

Photo Stories