Skip to main content

TS DSC Notification 2023: మంత్రి సబిత కీలక వ్యాఖ్యలు...

మంత్రి సబిత కీలక వ్యాఖ్యలు... నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రేపే డీఎస్సీ నోటిఫికేషన్‌... పోస్ట‌ల వివ‌రాలు ఇవే...
Good news for unemployees
Job notifications

సాక్షి, ఎడ్యుకేష‌న్: తాజాగా తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. 

మంత్రి సబిత, బషీర్‌బాగ్‌లో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాల విద్యకు సంబంధించి టీచర్‌ పోస్టుల భర్తీకి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని పేర్కొన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ వివరాలను రేపు విడుదల చేయనున్నట్టు తెలిపారు. 5089 ఉపాధ్యాయ, ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1523 పోస్టులు భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఈసారి టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారానే ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి రెండ్రోజుల్లో నోటిఫికేషన్‌, విధివిధానాలను ఖరారు చేస్తామన్నారు. త్వరలో డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 

Published date : 24 Aug 2023 05:08PM

Photo Stories